‘ ది కాశ్మీర్ ఫైల్స్’ దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలను పొందుతోంది. ముఖ్యంగా ప్రధానిమోదీ, హోంమంత్రి అమిత్ షాల నుంచి ప్రశంసలు అందుకుంది. 1990లో కాశ్మీర్ నుంచి పండిట్లను తరిమివేయడం.. వారిపై అత్యాచారాలు, హత్యాకాండను డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చాలా ధైర్యంగా చూపించారు.
ఇదిలా ఉంటే ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు తావిస్తోంది. ఇటీవల ఆదిలాబాద్ లో ఓ థియేటర్లో కొందరు ఆకతాయిలు పాక్ అనుకూల నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే యూపీలోని కుషినగర్ జిల్లాలోని ఫాజిల్ నగర్ లో సినిమా థియేటర్లో ముగ్గురిపై కత్తులతో దాడిచేశారు. సినిమా ముగిసిన తర్వాత జాతీయవాద నినాదాలు చేసిన యువకులపై ఓ వర్గం వ్యక్తులు కత్తులతో దాడులు చేశారు.