కింగ్ నాగార్జున, ధనుష్‌ మల్టీ స్టారర్ మూవీ టైటిల్ ప్రకటించిన మేకర్స్

-

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కింగ్ నాగార్జున, తమిళ నటుడు ధనుష్‌ ప్రధాన పాత్రల్లో  ప్రతిష్టాత్మక మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కుతోంది.ఇక ఈ సినిమాకి ‘కుబేర’ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

కుబేర అంటే.. అన్ని లోకాల్లో అత్యంత ధనవంతుడు అని అర్థం. అలాంటి టైటిల్ కు, బిచ్చగాడిలా ఉన్న ధనుష్ కు ఏంటి సంబంధం అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ధనుష్ లుక్ చూసాక.. ఫ్యాన్స్ చెప్తున్న ఒకే ఒక్క మాట మార్క్ మై వర్డ్స్.. ధనుష్ కెరీర్ లో మరో అవార్డు గ్యారెంటీ అని అంటూ ఉన్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నికేత్‌ బొమ్మి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ని గోవా తిరుపతిలో జరిపిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథ ముంబైలోని ధారావి ప్రాంతం చుట్టూ తిరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version