చెన్నెతో మ్యాచ్.. సన్ రైజర్స్ కి కు అంత ఈజీ కాదు!

-

ఐపీఎల్లో భాగంగా ఈరోజు సాయంత్రం చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ తో సన్రైజర్స్ తలపడుతోంది. పాయింట్స్ టేబుల్లో నెలకొన్న పోటీ దృష్ట్యా రెండు జట్లకూ ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. గణాంకాల ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ పై చెన్నైదే పైచేయిగా ఉంది. రెండూ 20సార్లు తలపడితే, 14సార్లు చెన్నైదే గెలుపు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ హోం స్టేడియంలో సన్రైజర్స్ చరిత్రలో ఒక్కసారీ గెలవలేదు.ఈ నేపథ్యంలో చెన్నైను అడ్డుకోవడం హైదరాబాద్కు సవాల్ గా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే మాత్రం చరిత్రే. ఇప్పటివరకు చెన్నై ఆడిన ఎనిమిది మ్యాచ్లో కేవలం నాలుగింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతుంది. ఇక సన్రైజర్స్ ఆడిన ఎనిమిది మ్యాచ్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

కాగా, ఈ మ్యాచ్ కి 7: 30 pm ప్రారంభం కానుంది.భారీ స్కోర్లతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పైనే అందరి దృష్టి ఉంది. ఇవాళ గెలిస్తే ఆరెంజ్ టీమ్ రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది..ఈ సీజన్లో మూడు సార్లు 250+ స్కోర్లు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ 300+ స్కోర్ చేస్తుందేమో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version