హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లోని ఓవైసీ ప్లై ఓవర్ ఇవాళ ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 10 గంటల సమయం లో.. ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేశారు జీహెచ్ ఎంసీ అధికారులు. ఏకంగా రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలో మీటర్ల పొడవున ఈ ఓవైసీ ప్లై ఓవర్ ను నిర్మించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
వన్ వే రోడ్డుగా 3 లైన్ల తో 12 మీటర్ల వెడల్పు తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం అయింది. 2018 ఏప్రిల్‌లో ఎస్ఆర్‌డీపీ కింద ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాగా… ఈ ఏడాది పూర్తి అయింది. ఈ ఓవైసీ ప్లై ఓవర్ అందుబాటులోకి రావడం తో ఆరాంఘర్, చాంద్రాయణగుట్ట నుంచి ఎల్బీనగర్ బైరమల్ గుడా, కర్మాన్‌ఘాట్ వైపు వెళ్లే వాహన దారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. ఇక ఈ ఓవైసీ ప్లై ఓవర్ ఏర్పాటు కావడం పై హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Happy to be dedicating the newly built 1.365 KM long flyover at Owaisi-Midhani junction tomorrow to the people of Hyderabad
Built by GHMC at a cost of ₹80 Cr under the #SRDP (Strategic Road Development Program) a brainchild of Hon’ble CM KCR Garu
My compliments to SRDP team👍 pic.twitter.com/yECnl6Jolq
— KTR (@KTRTRS) December 27, 2021