వామ్మో ఇదేం పిచ్చిరా నాయనా..డబ్బుల కోసం ఇంత చెయ్యాలా?

-

సాహస వీరుడు సాగర కన్య సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది..అయితే ఆ కన్య లాగా ఉండాలని చాలా మంది అభిప్రాయపడతారు.వీటికి సంభందించిన ఎన్నో కథలు కూడా ఉన్నాయి.అందమైన జలకన్యకి అందరూ ఫిదా అయ్యారు. కానీ మనం పెద్దయ్యాక, మత్స్యకన్యగా ఉండటం కేవలం ఒక అద్భుత కథ అని మనం గ్రహిస్తాము. మత్స్యకన్యల గురించి హాలీవుడ్‌లో చాలా కథలు వచ్చాయి.

ఇది ప్రజలను బాగా అలరిస్తుంది. ఈ విధంగా, మెర్మైడ్ గర్ల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…
మరి ఆలస్యం లేకుండా వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… 32 ఏళ్ల ఎమిలీ అలెగ్జాండ్రా గుగ్లీల్మో తన నిజ జీవితంలో డిస్నీ క్యారెక్టర్ ఏరియల్‌గా నటించడం ప్రారంభించింది. అలా ఆమె నెలకు దాదాపు 6 లక్షల రూపాయలు సంపాదించడం ద్వారా తన కలలను నిజం చేసుకుంటుంది. మత్స్యకన్యగా ప్రసిద్ధి చెందిన ఈ యువతిని పిల్లల పుట్టినరోజు పార్టీలు, ఫైవ్ స్టార్ హోటళ్లలో జరిగే కార్యక్రమాలకు పిలుస్తారు. ఇక్కడ ఆమె ఈత కొలనులో మత్స్యకన్యలా గడపాల్సి ఉంటుంది.

దీనికి ఆమెకు డబ్బు కూడా వస్తుంది. దీనికి సంభంధించిన విషయాలను పంచుకుంది.మత్స్యకన్య కావడం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను ప్రజల కలలను నిజం చేస్తాను. శాంతా క్లాజ్‌ని ప్రజలు విశ్వసిస్తున్నట్లే నేనూ నిజమైన మత్స్యకన్య అని వారు నమ్ముతారు. నేనెప్పుడూ మత్స్యకన్యలానే ఉన్నాను. చిన్నప్పుడు నేను ప్రతి వారం బీచ్‌కి వెళ్లి సముద్రంలో ఈత కొడుతూ ఆనందిస్తున్న విషయాన్ని పంచుకుంది. మత్స్యకన్యలా ఫోటో తీయాలని నిర్ణయించుకున్నాను.

ఫోటోలు తీయడానికి డబ్బు ఇచ్చాను. ఆ ఫోటో ఇంత ఆకర్షణీయంగా ఉంటుందని నాకు తెలియదు. ఆ తర్వాత ప్రజలు నా దగ్గరకు రావడం, వారి ఈవెంట్‌లు, పార్టీలకు ఆఫర్ చేయడం ప్రారంభించారు.అలా అదే బిజినెస్ గా మార్చుకుంది..మొత్తానికి ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news