ట్రైన్‌లో ఓ చిన్నారి పోగుట్టుకున్న బొమ్మను వెతికి.. ఇంటికి వెళ్లి ఇచ్చిన రైల్వే అధికారులు.!.

-

ట్రైన్‌ ఎక్కిన దగ్గర నుంచి మనకు మన లగేజ్‌ మీదే శ్రద్ధ ఉంటుంది. ఎక్కడ ఎవరూ కొట్టేస్తారేమో అని భయం.. ట్రైన్‌ జర్నీ బాగుంటుంది కానీ.. కొన్ని విషయాల్లో మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఆ టాయిలెట్స్, ఇంకా దొంగల భయం. నిద్రవస్తుంది..కానీ ప్రశాంతంగా నిద్రపట్టదు.. ట్రైన్‌లో ఏదైనా మిస్‌ అయిదంటే.. అది ఇక అస్సామే..! మనం కూడా చాలాసార్లు..పవర్‌బ్యాంకులు, ఛార్జర్లు లాంటివి పోగుట్టుకోని ఉంటాం.. అవి మళ్లీ మీకు ఎవరైనా తెచ్చి ఇస్తే ఎలా ఉంటుంది.

ట్రైన్‌లో ఓ పాప పోగుట్టుకున్న ఒక బొమ్మను రైల్వే అధికారులు వెతికి పట్టుకోని మరీ ఆ పాప అడ్రస్‌ కనుక్కోని వెళ్లి ఇచ్చారు. అప్పుడు ఆ పాప కళ్లల్లో ఆనందం చూడాలి అంత ఇంతా కాదు. అయినా రైల్వే అధికారులు ఇంతలా ఎందుకు చేశారా..? ఎనీ స్పెషల్‌ రీజన్..?

జనవరి 4న సికింద్రాబాద్-అగర్తల ట్రైన్ (Train No.07030)లో ప్రయాణిస్తున్న ఓ 19 నెలల చిన్నారి ఓ బొమ్మను పోగొట్టుకుంది. తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకోవడంతో ఏడుస్తున్న ఆ చిన్నారిని గమనించిన మరో ప్రయాణికుడు రైట్ మదన్ యాప్ సహాయంతో 139 నంబర్‌కు ఫోన్ చేశాడు. దీంతో స్పందించిన రైల్వే అధికారులు పశ్చిమ బెంగ్‌లోని న్యూజలపాయిగురి స్టేషన్ ప్రాంతంలో ఆ బొమ్మను గుర్తించారు. ఆ పాప అడ్రస్‌ను వెతికి పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ఖాజీగావ్‌లో ఆ పాప చిరునామాను గర్తించిన అధికారులు ఇంటికి వెళ్లి మరీ ఆ బొమ్మను అందించారు.

దీంతో ఆ పాప ఆనందానికి అవదుల్లేవు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.. ఈ ఫొటోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. చిన్నారి కళ్లల్లో ఆనందం నింపిన రైల్వే అధికారులను అభినందిస్తున్నారు. మీరు కూడా ట్రైన్‌లో ఏదైనా పోగుట్టుకుంటే.. ఆ యాప్‌ ద్వారా రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వండి.. కచ్చితంగా వస్తుంది అని చెప్పలేం కానీ.. ప్రయత్నించడంలో తప్పు అయితే లేదు కదా..!

Read more RELATED
Recommended to you

Latest news