ఒకప్పుడు సినిమాలలో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కృష్ణ భగవాన్ ప్రస్తుతం ఆఫర్లు లేక జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన వచ్చిన తర్వాత షో టిఆర్పి రేటింగ్ బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. మంచి కామెడీ టైమింగ్ తో పంచులు వేసే కృష్ణ భగవాన్ ఇంత పాపులారిటీ దక్కించుకున్నా కూడా సినిమాలలో అవకాశాలు రాకపోవడానికి? ఆయన కెరియర్ నాశనం అవ్వడానికి? కారణం కూడా లేకపోలేదు. పశ్చిమగోదావరి జిల్లా కైకవోలులో పుట్టిన కృష్ణ భగవాన్ మొదటి చెన్నైలో అవకాశాల కోసం వేట మొదలుపెట్టారు. అలా వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాతో తన సినిమా కెరియర్ను మొదలు పెట్టిన కృష్ణ భగవాన్ కి కెరియర్ మలుపు తిరగలేదు.
1988 నుంచి 2002 వరకు ఆయనకు ఏ సినిమాతో కూడా మంచి బ్రేక్ రాలేదని చెప్పాలి. 2002లో చివరిగా వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో మంచి బ్రేక్ పడింది. ఈ సినిమాలో ఆయన పంచులకు జనాలు కడుపుబ్బా నవ్వారు. అంతేకాదు ఈ సినిమా సాలిడ్ హిట్ అవ్వడంతో ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. తర్వాత 2002 నుంచి 2018 వరకు కృష్ణ భగవాన్ అనేక సినిమాలలో నటించారు. అంతేకాదు ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాకు రైటర్ గా కూడా పనిచేశారు. ఇక ఊహలు గుసగుసలాడే సినిమాకు నరేషన్ కూడా చేశారు. 2020లో వచ్చిన రాగల 24 గంటల సినిమా కోసం మరోసారి రైటర్ గా మారారు.
అంతేకాదు కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు జాన్ అప్పారావు 40 ప్లస్ సినిమా చేయగా .. అందులో ఈయన హీరోగా, సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమాలో కూడా లీడ్రోల్ పోషించడం జరిగింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ అలాంటి ప్రయోగాలు చేయలేదు. ఇకపోతే ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఈయనకు రావాల్సిన పేరు రాకపోవడానికి కారణం తాగుడు అని చెప్పాలి.. ఈ వ్యసనం వల్లే .. తాగి ఈ మధ్యకాలంలో ఒక కాలేజ్ ఈవెంట్ కు వెళ్లి నానారబసా చేశాడు. ఇక షూటింగ్ కూడా టైం కి రాకపోవడం తో అవకాశాలు తగ్గిపోయాయి . అలా తన కెరీర్ను ఆయనే తన చేజేతులారా కోల్పోయాడని చెప్పవచ్చు.