నందమూరి హీరోల సపోర్ట్ విశ్వక్ సేన్ కి లభించడానికి కారణం..?

-

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ.. ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 22వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదు శిల్పకళా వేదికలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై విశ్వక్ సేన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇకపోతే ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రావడంతో సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్ జరిగిందని చెప్పాలి. ఈ నందమూరి హీరో మాత్రమే కాదు మరొక హీరో కూడా విశ్వక్ సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనే బాలకృష్ణ. మరొకవైపు బాలకృష్ణ కూడా విశ్వక్ కు సపోర్ట్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా నందమూరి హీరోలు ఉన్నట్టుండి విస్వక్ కు మద్దతు పలకడానికి గల కారణం ఏంటి అనే చర్చలు కూడా జరుగుతున్నాయి..

అయితే ఈ వేడుకలో భాగంగా విశ్వక్ మాట్లాడుతూ.. తాను ఈ వేడుకకు ఆహ్వానించడం కోసం ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే ఆయన స్వయంగా తనతో పాటు భోజనం చేశారని చాలా మంచిగా ఆతిథ్యం ఇచ్చారని తెలిపారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా కోసం విశ్వక్ నందమూరి నటసింహ బాలకృష్ణని కూడా కలిశారు. అడగ్గానే ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు అని బాలకృష్ణతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాలను వెల్లడించారు. మొత్తానికి అయితే నందమూరి హీరోల మంచితనమే ప్రతి ఒక్కరికి సపోర్టుగా నిలవడానికి కారణం అవుతుంది అంటూ విశ్వక్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news