ప‌రువు నిల‌బెట్టుకున్న జ‌న‌సేన‌.. వైసీపీ అరాచ‌కాల‌పై ఆధారాలు ఉన్నాయంటున్న ప‌వ‌న్‌..

-

ఏపీలో వైసీపీ దెబ్బ‌కు మిగ‌తా పార్టీలు అన్నీ పార్టీలు ఢీలా ప‌డిపోతున్నాయి. ఇలాంటి త‌రుణంలో వ‌రుస ఎన్నిక‌ల్లో అస‌లు వైసీపీకి తిరుగు లేకుండా పోతోంది. ఇక రీసెంట్ గా జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అది మ‌రోసారి నిరూపిత‌మైంది. కాగా వైసీపీ హ‌వాను త‌ట్టుకుని మ‌రీ ప‌రువు నిలుపుకున్న పార్గీగా జ‌న‌సేన నిలిచింది. వైసీపీ దెబ్బ‌కు టీడీపీ లాంటి ఘ‌నమైన చరిత్ర ఉన్న, బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌ల వ్య‌వ‌స్థ ఉన్న‌ పార్టీనే ఢీలా ప‌డ్డా కూడా జ‌న‌సేన మాత్రం అందుకు భిన్నంగా ఏ మాత్రం ప్ర‌జాప్ర‌తినిధుల స‌పోర్టు లేక‌పోయినా అంతో ఇంతో పోటీ ఇచ్చింది.

ఏపీలో అస‌లు ఎక్క‌డా ఎమ్మెల్యేలు లేని పార్టీగా బ‌రిలోకి దిగిన వైసీపీ దాదాపుగా 177 ఎంపీటీసీ స్థానాల్లో అలాగే రెండు జడ్పీటీసీ గెలుచుకుని పోటీ ఇచ్చింది. ఇంకా చాలా చోట్ల ఇలాగే మంచి పోటీని జ‌న‌సేన ఇచ్చింద‌ని చెప్పొచ్చు. ఇక ఈ ఎన్ని్క‌ల ఫ‌లితాల‌పై ప‌వ‌న్ స్పందిస్తూ పార్టీ త‌ర‌ఫున గెలిచిన వారికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే త‌మ పార్టీ ముందుగానే అనుకున్న ల‌క్ష్యం మేర‌కు ఫ‌లితాలు రాలేవ‌ని తెలిపారు.

కానీ తాము మాత్రం వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చిన‌ట్టు వివ‌రించారు. ఇక త‌మ‌కు అధికంగా సీట్లు రాక‌పోవ‌డానికి వైసీపీ చేసిన ప‌నులు కార‌ణ‌మ‌న్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నికలు వైసీపీ అరాచ‌కాల న‌డుమ సాగింద‌ని, వీటికి సంబంధించిన సమాచారం త‌న ద‌గ్గ‌ర పూర్తి స్థాయిలో ఉంద‌ని తెలిపారు. ఇక ఇప్పుడు కొన్ని మాత్ర‌మే ఉన్నాయ‌ని, పూర్తి స్థాయిలో ఆధారాలు సేక‌రించిన త‌ర్వాత తాను మాట్లాడుతానంటూ వెల్ల‌డించారు. అయితే జనసేన సాధించిన ఫ‌లితాలు పార్టీ ప‌రువును కాపాడాయంటున్నారు చాలామంది. ఇక ప‌వ‌న్ ముందు ముందు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version