ఫోన్ ఎక్కడా పెట్టానా అని ప్రతీసారీ వెతుకుతున్నారా? డిజిటల్ బ్రేక్ తీసుకోవాల్సిందే..

-

మహమ్మారి సమయంలో భౌతికంగా ఇతరులను కలిసే అవకాశం తక్కువ కావడంతో స్మార్ట్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. కేవలం మాట్లాడ్డమే కాదు వీడీయోలు, సినిమాలు, సిరీస్ లు, షాపింగ్ సహా అన్నీ స్మార్ట్ ఫోన్ ద్వారానే. వంచిన తల ఎత్తకుండా అటు కళ్ళని, ఇటు నడుమును పాడు చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఐతే అతి సర్వత్రా వర్జయేత్ అన్న సంగతి మీకు తెలిసిందే.

ఎక్కువ వాడకం ఏ విషయంలోనూ ఎక్కడా మంచిది కాదు. దీనివల్ల అనేక మానసిక సమస్యలతో పాటు శారీరక ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అందుకే దాన్నుండీ బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి. డిజిటల్ సాధనాలకు కొన్ని రోజులను ముట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐతే డిజిటల్ బ్రేక్ ఖచ్చితంగా అవసరం అనిపించినపుడు కొన్ని సంకేతాలు మీలో కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఫోన్ కనిపించకుండా పోయిన ప్రతీసారీ యాంగ్జయిటీతో పాటు ఒత్తిడికి లోనవుతారు.

ప్రతీ 5నిమిషాలకి ఒకసారి స్మార్ట్ ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు. ఏదైనా అప్డేట్ వచ్చిందా అని చుస్తూ ఉంటారు.

సోషల్ మీడియాలో సమయం వెచ్చించిన తర్వాత అలసటగానూ, ఒత్తిడిగానూ అనిపిస్తుంటుంది.

పోస్ట్ చేయడం, షేర్, కామెంట్, లైక్ చేయడంతో పాటు అవతలి వాళ్ళు షేర్ చేస్తున్నారా, లైక్ చేస్తున్నారా అని పదే పదే ఆలోచించడం.

స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూ రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పొద్దు పొద్దున్నే పోస్టు పెట్టాలన్న ఉద్దేశ్యంతో తొందరగా నిద్రలేవడం.

ఒకే విషయం మీద దృష్టి నిలపడంలో ఇబ్బంది పడుతుండడం, స్మార్ట్ ఫోన్ లేకపోతే ఏదైనా అవుతుందేమోనన్న భయం.

ఏ నోటిఫికేషన్ వచ్చినా దాన్ని చెక్ చేయడం. మీఖు సంబంధం లేనిదైనా దాన్ని చదవదం, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడానికి అయిష్టపడడం.

పై లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే డిజిటల్ బ్రేక్ తీసుకోండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు మీకు బ్రేక్ అవసరం. జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version