ముగిసిన రాహుల్‌గాంధీ ఈడీ విచారణ

-

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరిపింది. దాదాపు 3 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్‌గాంధీ, పార్టీ నేతలు భారీ ర్యాలీగా సోమవారం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియా లిమిటెడ్‌తో రాహుల్‌కు సంబంధాలు ఉన్నాయని, ఈ మేరకు షేర్ హోల్డర్లతో సంబంధాలు, యంగ్ ఇండియాకు కాంగ్రెస్ రుణాలు, నేషనల్ హెరాల్డ్ పునరుద్ధరణ, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు, నిధుల బదిలీ వివరాలపై ఈడీ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ

మూడు గంటల ఈడీ విచారణ తర్వాత రాహుల్‌గాంధీ బయటకు వచ్చారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. మరోవైపు సత్యాగ్రహ ర్యాలీలో పాల్గొన్న కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తదితర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్‌కు తరలించిన కాంగ్రెస్ నేతలను ప్రియాంక గాంధీ కలిశారు. అయితే కాంగ్రెస్ ఎంపీ అధిర్ చౌదరి, కేసీ.వేణుగోపాల్‌పై పోలీసులు చేయి చేసుకున్నట్లు సమాచారం. దీంతో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version