హరీష్ రావు బడ్జెట్ పుస్తకం చాలా లావుగా ఉంది కానీ అందులో మ్యాటర్ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజల సమస్యలు గవర్నర్ ప్రసంగంలో రాలేదని.. కనీసం ఈ బడ్జెట్ లోనైనా వస్తాయని ఆశ ఉండేది అన్నారు. కాన్సర్ రోగులు, గుండె రోగుల ప్రస్తావన బడ్జెట్ లో రాలేదన్నారు. VRA, RMP, లాంటి వాళ్ళ గురించి చర్చ లేదని అన్నారు. విభజనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల గురించి బడ్జెట్ లో లేదన్నారు.
యాదగిరి గుట్ట కు మెట్రో కావాలని డిమాండ్ చేసాము కానీ ప్రస్తావన లేదని దుయ్యబట్టారు. హరీష్ రావు ఓ పుస్తకం తెచ్చి పాఠం చదివి వెళ్లారని ఎద్దేవా చేశారు. అనాధాపిల్లలను ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. కానీ బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీ లోపల, బయట పోరాటం చేస్తామన్నారు. బడ్జెట్ లో సవరణలు చేయాలన్నారు.