చాలా మందికి కాఫీ అలవాటు ఉంటుంది. కాఫీ పడకపోతే రోజు గడవదు. అయితే కాఫీ తాగే వాళ్లలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేయకపోతే కాఫీ తాగడం వల్ల ఇబ్బందులు ఉండవు. అయితే కాఫీ తాగడానికి సరైన పద్ధతి గురించి ఇప్పుడు చూద్దాం.
మగ్గులని పక్కన పెట్టేయండి:
చాలా మంది పెద్ద పెద్ద మగ్గులతో కాఫీలు తాగుతూ ఉంటారు. అయితే ఎక్కువ కాఫీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కాఫీ తాగండి.
సాయంత్రం 5 తర్వాత కాఫీ తాగద్దు:
మీరు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నిద్ర పోతూ ఉంటే ఐదు లేదా ఆరు గంటలకి కాఫీ తాగడం మంచిది కాదు. చాలా మందికి సాయంత్రం పూట కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే దీనివల్ల నిద్ర రాకుండా కాఫీ చేస్తుంది. కాబట్టి రాత్రిపూట కాఫీ తీసుకోవద్దు.
చక్కెర ని దూరం పెట్టండి:
కాఫీ తియ్యగా ఉండాలని ఎక్కువ పంచదారని వేసుకుంటూ ఉంటారు. అయితే దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి అధిక చక్కెర ఉపయోగిస్తుంటే మానేయండి.
లిమిట్ గా తీసుకోండి:
చాలా మంది ఎప్పుడు చూసినా కాఫీ తాగుతూనే ఉంటారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పెద్దవాళ్లు 400 మిల్లీగ్రాముల కంటే కెఫీన్ ని తీసుకోకూడదు కాబట్టి కాఫీ తాగే వాళ్ళు అస్సలు ఈ తప్పులు చేయొద్దు. దీని వల్ల సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.