మనదేశంలో ముఖ్యంగా సందర్శించాల్సిన అధ్బుతమైన ప్రదేశాలు ఇవే..

-

ఇండియా గురించి మాటలో చెబితే సరిపోదు..ఈ భూ ప్రపంచంలో కల్లా మన దేశంలో ఎన్నో కళ్ళు చెదిరె అందమైన ప్రదేశాలను కలిగి ఉంది. అందులో ఎక్కువగా పర్యాటకులు సందర్శించే పర్యాటక స్థలాలలో టాప్ 10 పర్యాటక స్థలాల గురించి చెప్పుతున్నదే ప్రస్తుత ఈ వ్యాసం. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రదేశాలని అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపరచాలని, అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటిని పరిశుభ్ర పరచాలని భావిస్తున్నది. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏంటో ఒకసారి చూసెద్దామా..

తిరుపతి ..

ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి ఎంత పెద్ద పుణ్య క్షేత్రంలో అందరికీ తెలుసు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుండి తరలి వస్తుంటారు. భారతదేశంలో ఎక్కువ మంది యాత్రికులు సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. అందుకే ఆ ప్రాంతం అప్పుడు మనొహరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది..

తాజ్ మహల్ ..


తాజ్ మహల్ ఆగ్రా లో కలదు. ఇది ప్రపంచములోని ఏడు వింతల్లో ఒకటి. ప్రేమకు గుర్తుగా నిలిచిన ఈ అద్భుత కట్టడాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రదేశంలో మొక్కలను నాటి, పరిమళించే పచ్చదనానికి కృషి చేయాలని కేంద్రం భావిస్తున్నది..

మనికర్ణికా ఘాట్ ..


మణికర్ణికా ఘాట్ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో కలదు. ఈ ఘాట్ నే డెత్ టూరిజం అని కూడా అంటారు. అనేక మంది సందర్శకుల అంత్యక్రియలను ఇక్కడ బహిరంగంగా వెలిగించి నిప్పంటిస్తుంటారు. గంగా నది ఒడ్డున ఈ ప్రదేశాన్ని ‘గంగా నది ప్రక్షాళన’ కార్యక్రమంలో లో భాగంగా శుభ్రంగా ఉంచాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వైష్ణో దేవి ఆలయం ..


వైష్ణో దేవి ఆలయం హిందువుల పవిత్ర స్థలం. జమ్మూ నుండి 46 కి. మీ ల దూరంలో ఉన్న కాట్రా లోని త్రికూట హిల్స్ పై సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తున కలదు. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో దర్శించే ఈ ఆలయాన్ని కూడా శుభ్రపరచాలి కేంద్రం ఆలోచన. తిరుపతి వెంకన్న స్వామి తర్వాత దేశంలో అత్యధికులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు..

మీనాక్షి దేవాలయం..


తమిళనాట మధురై లో ఈ ఆలయం ఉంది..12 గేట్లు, 6 హెక్టార్లలో విస్తరించిన ఈ ఆలయం అద్భుత శిల్ప సంపదకు తార్కాణం. ఏటా అధిక సంఖ్యలో మీనాక్షి అమ్మవారికి యాత్రికులు సందర్శిస్తుంటారు. ఆలయ పరిసరాలని అందంగా తీర్చిదిద్ధేందుకై ప్రభుత్వం భావిస్తున్నది.

శివాజీ టెర్మినల్

Chhatrapati Shivaji Maharaj Terminus | , India | Sights - Lonely Planet

శివాజీ టెర్మినల్ ముంబై నగరంలో కలదు. ఇది వరకు దీనిని విక్టోరియా టెర్మినల్ అని పిలిచేవారు. ఈ ప్రదేశం వాణిజ్య కేంద్రం. సంవత్సరం పొడవునా ముంబై వచ్చే యాత్రికులు టెర్మినల్ ను తప్పక సందర్శిస్తారు. పురాత పుస్తకాలు, చారిత్రక వస్తువులు, దుస్తులు, కంప్యూటర్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మే దుకాణాలు ఇక్కడ అధికం..

స్వర్ణ దేవాలయం ..

స్వర్ణ దేవాలయం, అమృత్సర్ లో కలదు. సిక్కుల పవిత్ర స్థలం గా ఖ్యాతి గాంచిన ఈ దేవాలయం యొక్క గురుద్వారా ని 400 కేజీల బంగారు పూత వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉంటే సిక్కులు ఏటా లక్షల సంఖ్యలో శ్రీ హరమందిర్ సాహిబ్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో మార్చెందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది..

కామాక్షి ఆలయం..

కామాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడు లోని కాంచీపురం లో కలదు. పల్లవ రాజుల చే నిర్మించబడ్డ ఆలయం లో అమ్మవారు యోగముద్రలో పద్మాసనం పై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లువరిస్తూ ఉంటుంది. ఆలయ శిల్ప సంపదను మరియు అమ్మవారిని దర్శించుకొనేందుకు ఎక్కువగా వస్తుంటారు..

జగన్నాథ ఆలయం..

ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో ప్రసిద్ధి గాంచిన జగన్నాథ ఆలయం కలదు. ఏటా నిర్వహించే రథయాత్ర సమయంలో భక్తులు లక్షల సంఖ్యలో హాజరై కృష్ణుడిని ఆరాధిస్తారు..ఇక్కడకు ఒక్కసారైనా వెల్లాలని జనాలు భావిస్తారు.

దర్గా షరీఫ్..

దర్గా షరీఫ్ అజ్మీర్ లో కలదు మరియు ఈ స్థలం మహమ్మదీయులకు పవిత్రమైనది. సూఫీ సన్యాసి ఖాజా మొయినుద్దీన్ చిస్తీ నివసించిన ప్రదేశంగా ఈ స్థలం అన్ని మతాల వారిచే గౌరవించబడుతున్నది…రోజు రోజుకు ప్రాచుర్యం పొందుతుంది..

మన దేశంలో ఎక్కువ మందికి నచ్చుతున్న పర్యాటక ప్రదేశాలు ఇవే..వీటితో దేశానికి ఆదాయం తో పాటు ప్రాముఖ్యత కూడా పెరుగుతూంది.. మన దేశానికి మూలాలు ఈ ప్రాంతాలు.. వీటిని ఒక్కసారి చూస్తె మళ్ళీ మళ్ళీ చూడాలని జనాలు అనుకోవడం సహజం..మీరు ఒక్కసారైనా వీటిని దర్శించండి..

Read more RELATED
Recommended to you

Latest news