కొత్తగా వచ్చిన బెస్ట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ బెనిఫిట్స్ ఇవే..!!

-

మెడికల్ ఖర్చులను కవర్ చేస్తున్న ఆరోగ్య భీమా పథకాలు దొరకడం చాలా కష్టం.కాగా,యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని లాంచ్ చేసింది. కంప్లీట్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌గా తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ పాలసీ వ్యవధిలో అయ్యే అన్ని ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తుంది. ప్రమాదాలు, అనారోగ్యం, ఏదైనా వ్యాధి కారణంగా ఆపరేషన్ చేయించుకోవడానికి ఖర్చులు చేస్తే వాటిని ఈ ప్యాకేజీ కవర్ చేస్తుంది. కంప్లీట్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సమగ్ర ఆరోగ్య బీమా కవరేజీగా పాలసీదారులకు అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో 14 బేస్, 26 యాడ్-ఆన్ కవర్‌లతోపాటు పలు కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. వైద్య ఖర్చులు పెరగకుండా పాలసీదారులకు అండగా ఉండేందుకు ఈ సరికొత్త ప్లాను ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కంపెనీ కంపెనీ తెలిపింది.
ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, డాబర్ ఇన్వెస్ట్‌మెంట్స్, సోంపో జపాన్ ఇన్సూరెన్స్ కంపెనీల జాయింట్ వెంచర్. ఈ కంపెనీ తాజాగా తీసుకొచ్చిన ప్లాన్ ఐదు ప్రొడక్ట్ వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాలసి గురించి పూర్తీ వివరాలు తెలుసుకుందాం…

హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రయోజనాలు..

*. యూనివర్సల్ సోంపో హెల్త్‌కేర్ ప్యాకేజీ ఎన్నిసార్లైనా రెన్యువల్ చేసుకునేలా సమగ్ర కవరేజీని అందిస్తుంది.
*. సరసమైన ప్రీమియం రేటుతో వివిధ సేవలకుగాను రూ.50 లక్షల వరకు బీమా మొత్తం ఆఫర్ చేస్తుంది.
*. పాలసీదారులు పాలసీ నాలుగో ఏడాదికి ప్రీమియం మినహాయింపును పొందే అవకాశం ఉంది.
*. కొన్ని నిర్దిష్ట వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ కేవలం ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. ముందుగా ఉన్న వ్యాధులకు కూడా వెయిటింగ్ పీరియడ్ తక్కువగానే ఉంటుంది.
*. ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD), ప్రసూతి కవరేజీతో పాటు అన్ని అత్యవసర సహాయ సేవలకు ఈ పాలసీ కవరేజ్ ఆఫర్ చేస్తుంది.

ఈ పాలసీ ముఖ్య అంశాలు..

*. ఈ పాలసీ వ్యవధి ఏడాది, రెండు లేదా మూడేళ్ళు ఉంటుంది.
*. దరఖాస్తు చేసుకునేవారికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 75 ఏళ్లు. పిల్లలకు విషయానికి వస్తే వారి కనీస వయస్సు 91 రోజులు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు.
*. ఈ ప్యాకేజీ కింద బీమా పాలసీదారుతో బంధుత్వం గల 20 మందికి కవరేజీ లభిస్తుంది.
*. బేస్ ప్యాకేజీ డే-కేర్ ప్రొసీజర్స్, పోస్ట్ హాస్పిటలైజేషన్, డొమిసిలియరీ ఖర్చులు, ఆర్గాన్ డోనర్, అంబులెన్స్ ఛార్జీలు, ప్రీ-హాస్పిటలైజేషన్‌తో సహా ఇన్-పేషెంట్ చికిత్సలపై కవరేజీని అందిస్తుంది.
*. అంతేకాదు.. ఔట్-పేషెంట్ చికిత్సలను కూడా కవర్ చేస్తుంది. తల్లి, శిశు సంరక్షణ, దంత చికిత్సకి కూడా కవరేజీ అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news