దేశంలో అందమైన సరస్సులు ఇవే.. ఇక్కడకు వెళ్తే ఆ అనుభూతే వేరు

-

మన దేశం పురాతన కట్టడాలకు, దివ్యఔషధాలకు, అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. ఇక్కడ ఉండే చారిత్రక కట్టడాలు.. అన్నీ అద్భుతాలే.. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. అలాగే.. ప్రకృతి అందాలు కూడా. ప్రతి రాష్ట్రంలో ఒక అందమైన ప్రదేశాన్ని మనం కచ్చితంగా చూడొచ్చు.. కొన్ని ఏరియాల్లో అయితే.. ప్రతి జిల్లాకు ఒక్కో ప్రత్యేకం ఉంటుంది. వీటన్నింటిలో.. సరస్సుల లిస్ట్ తీస్తే.. కొన్ని తేలాయి. అవి ఎక్కడ ఉన్నాయి.. వాటి పేర్లేంటో చూద్దామా.. బ్యూటిఫుల్ లేక్స్ గురించి.. లేట్ చేయకుండా చదివేయండి..!
చిల్కా సరస్సు: ఒడిశాలోని చిల్కా సరస్సు భారతదేశంలోని అతిపెద్ద సరస్సులలో ఒకటి. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఈ సరస్సును సందర్శించడానికి సరైన సమయం. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది.
దాల్ లేక్: కాశ్మీర్ భారతదేశంలో ప్రసిద్ధ హనీమూన్ డెస్టినేషన్. చాలామందికి హనిమూన్ ప్లేసుల్లో.. మొదట ఇదే ఉంటుంది. ఇక్కడ ఉన్న దాల్ సరస్సు ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన అందాన్ని కలిగి ఉంది. పెళ్ళైన కొత్త దంపతులు హనీమూన్ కు దాల్ లేక్ సరస్సు బెస్ట్ సెలక్షన్.
లోక్‌తక్ సరస్సు: ఈ సరస్సు దేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న మణిపూర్‌లో ఉంది. ఈ సరస్సును మంచినీటి సరస్సు అని కూడా అంటారు. దీని అందం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.
సోన్ బీల్ సరస్సు: అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో ఉన్న దీనిని చిత్తడి నేల అని కూడా పిలుస్తారు. వేసవిలో ఈ సరస్సు చాలా బాగుంటుంది. శీతాకాలంలో సరస్సులోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తారు.
ఇవి ఇండియాలో అందమైన సరస్సులు.. లైఫ్ లో ఒక్కసారైనా ఇవన్నీ చుట్టేయాలి అని చాలామంది అనుకుంటారు. సీజన్ బట్టి.. వాటి అందాలను చూస్తే..ఇంకా మజా వస్తుంది. అవకాశం వస్తే.. వీటిని చూడటం అస్సలు మిస్ చేసుకోవద్దే..! ఫొటోషూట్ కు సరస్సులు చాలా బాగుంటాయి..అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోని మాత్రమే ఇలాంటి ప్రదేశాల్లో ఫొటోషూట్ ప్లాన్ చేసుకోవాలి.. లేదంటే ప్రమాదమే. మనం చూస్తూనే ఉన్నాం.. ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ లు ఎలా బెడిసికొడుతున్నాయో..!

Read more RELATED
Recommended to you

Latest news