సినీ అభిమానుల‌కు ఇక పండగే.. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

-

ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు థీయేట‌ర్స్ ల‌లో ఎంత హిట్ అవుతున్నాయో.. అంత కంటే.. ఎక్కువ హిట్ ఓటీటీల్లోనూ అవుతున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి స‌మ‌యంలో థీయేట‌ర్స్ మూత ప‌డ‌టంతో చాలా మంది ఓటీటీ ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఓటీటీల క్రేజ్ విపరీతంగా పెరిగింది. సినిమాలు థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయిన 3 నుంచి 4 వారాల్లో ఓటీటీలు విడుద‌ల అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఇంట్లోనే హాయిగా సినిమాలు చేస్తున్నారు.

అయితే ఇటీవ‌ల థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయిన సినిమాలు ఈ వారంలో ప‌లు ఓటీటీల్లో విడుద‌ల కాబోతున్నాయి. రాధే శ్యామ్, ఆడ‌వాళ్లు మీకు జోహర్లు, హే సినామికా, స్టాండ్ అప్ రాహుల్ సినిమాలు ఈ వారం ఓటీటీల్లో విడుద‌ల కాబోతున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాలు కూడా థీయేట‌ర్స్ ల‌లో ఆశించిన స్థాయిలో రాణించ లేక పోయాయి. థీయేట‌ర్ ల్లో ఆక‌ట్టుకోలేని ఈ సినిమాలు ఓటీటీలో ఏ మేరకు విజ‌యం సాధిస్తాయో చూడాలి మ‌రి.

దుల్క‌ర్ స‌ల్మ‌న్, కాజ‌ల్ ఆగ‌ర్వాల్ నటించిన హే సినామికా. మార్చి 3న ఈ సినిమా థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయింది. కాగ ప్ర‌స్తుతం ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 31వ తేదీన‌ విడుద‌ల అయింది.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, పూజా హెగ్డే న‌టించిన రాధేశ్యామ్. ఈ సినిమా మార్చి 11 వ తేదీన థీయేట‌ర్ ల‌లో విడుదల అయింది. ప్ర‌స్తుతం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 1వ తేదీన‌ విడుద‌ల అయింది.

స‌ర్వానంద్, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్ లు గా చేసిన సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహర్లు. ఈ సినిమా థీయేట‌ర్ ల‌లో మార్చి 4న విడుద‌ల అయింది. ప్ర‌స్తుతం ఈ సినిమాను సోనీ లివ్ లో ఏప్రిల్ 2 వ తేదీన విడుదల కానుంది.

రాజ్ త‌రుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జోడీ గా న‌టించిన సినిమా స్టాండ్ అప్ రాహుల్. ఈ సినిమాను మార్చి 18న థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయింది. కాగ ఈ సినిమా ఆహా లో ఏప్రిల్ 2 వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version