ఈవారం థియేటర్లో..ఓటీటిలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!!

-

దసరా పండుగకు సీనియర్ హీరో ల హవా బాగానే చూపించారు. దీపావళి పండుగకి యువ హీరోలు సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఇక అలాగే ఓటీటి లో కూడా పలు చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటిటి, థియేటర్లలో విడుదలయ్యే పలు చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

థియేటర్:
1). జిన్నా:
మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు.

2). సర్దార్:
అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కార్తీ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పై యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు పిఎస్ మిత్రన్ ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతోంది.

3). ప్రిన్స్:
శివ కార్తికేయన్ హీరోగా జాతి రత్నాలు డైరెక్టర్ కెవి అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో అక్టోబర్ 21 విడుదల కాబోతోంది.

4). ఓరి దేవుడా:
విశ్వక్ సేన్ హీరోగా, మిథిలా పాల్కర్, ఆశా భట్ కలిసిన తీస్తున్నారు ఈ చిత్రంలో విచిత్రాన్ని తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించారు. ఇందులో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు ఈ చిత్రం ఈనెల 21న విడుదల కాబోతోంది.

ఓటిటి:
ఇక దీపావళికి ఓటీటి లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
1). అమ్మ: అమెజాన్ ప్రైమ్-19 వ తేదీ
2). ఒకే ఒక జీవితం: సోనీ లివ్ -అక్టోబర్ 20
3). బింబిసారా: జీ -5 .. అక్టోబర్ 21
4). కృష్ణ వ్రింద విహారి: నెట్ ఫ్లిక్స్ -అక్టోబర్ 23

Read more RELATED
Recommended to you

Exit mobile version