ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డు రేసులో ఉ‍న్న ఆటగాళ్లు వీరే

-

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ల లిస్టు వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. మెన్స్ క్రికెట్ లో నామినేట్ అయిన ముగ్గురు ప్లేయర్లలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ స్టోక్స్, జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ సంట్నర్ ఉన్నారు.

ఇంగ్లాండ్ వేదికగా దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో బెన్ స్టోక్స్ రెండో టెస్టులో నాలుగు వికెట్లతో పాటు సెంచరీ చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమంగా ఉంది. మూడో టెస్ట్ డిసైడర్ కానుంది. జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికిందర్ రజా ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుచుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి ఈ గౌరవం దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version