అభిమాన హీరోలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు వీళ్లే..!

-

సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సహజమైన విషయంగానే భావిస్తుంటారు. సినిమాలో మాదిరిగా రియల్ లైఫ్ లోనూ సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు. తమ తో కలిసి ఆన్ స్క్రీన్ పెయిర్ గా నటించిన హీరోయిన్లను తర్వాత ఆఫ్ స్క్రీన్ పెయిర్స్ గా మార్చుకున్నారు కొందరు తారలు. కాగా, ఈ అగ్ర హీరోలు మాత్రం తమ అభిమానులను మాత్రమే పెళ్లి చేసుకున్నారు. తమను హీరో గా అమితంగా అభిమానించే అమ్మాయిలను తమ జీవిత భాగస్వామిగా మార్చుకున్నారు.

rajinikanth latha marriage
rajinikanth latha marriage

స్టైల్ కు కేరాఫ్, సినీ లెజెండ్, సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమాని అయిన లతను మ్యారేజ్ చేసుకున్నారు. ఎథిరాజ్ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్న ల‌త‌ ఫస్ట్ టైమ్ ఓ సారి సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇంటర్వ్యూ చేశారట. అలా అప్పుడు వీరి పరిచయం జరిగింది. తర్వాత అది కాస్తా ప్రేమగా మారింది. వీరిరువురు ఆ తర్వాత దంపతులు అయ్యారు.

తలపతి విజయ్..కూడా తన అభిమాని అయిన సంగీతను జీవిత భాగస్వామి చేసుకున్నారు. ఓ పిక్చర్ షూటింగ్ టైమ్ లో విజయ్ ను కలిసి ఆయనతో ఫొటో దిగి, ఆటోగ్రాఫ్ తీసుకుంది సంగీత. అలా విజయ్ ఫోన్ నెంబర్ తీసుకుని చాటింగ్ స్టార్ట్ చేసింది. అలా వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో సంగీత కుటుంబ సభ్యులను పిలిపించి వారితో మాట్లాడి..సంగీతను మ్యారేజ్ చేసుకున్నారు విజయ్.

విలక్షణ నటుడు ఆర్.మాధవన్..హీరోగా తన సినీ కెరీర్ ను స్టార్ట్ చేయడాని కంటే ముందర ఓ ఇన్ స్టిట్యూట్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ టీచ్ చేసేవాడు. ఆ క్లాస్ స్టూడెంట్ అయిన సరితతో ప్రేమలో పడ్డాడు. అలా వీరిరువురి ప్రేమ కాస్త వివాహ బంధంగా మారింది. వీరిరువురి పెళ్లి ఘనంగా జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో రాజేశ్ ఖన్నా.. అంటే డింపుల్ కంపాడియా.. ఆమె సినీ ఎంట్రీ ఇచ్చేనాటికి రాజేశ్ ఖన్నా..రిటైర్ అయ్యారు. అయినప్పటికీ ఆయనపైన ఉన్న అభిమానంతో రాజేశ్ ఖన్నాను.. డింపుల్ కపాడియా పెళ్లి చేసుకుంది. వీరిరువురి కూతురే ట్వింకిల్ ఖన్నా..

Read more RELATED
Recommended to you

Latest news