ఈ లక్షణాలుంటే మీకు థైరాయిడ్‌ ఉన్నట్టే!

-

మహిళలను బాగా వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్‌ ఒకటి. షుగర్, బీపీల తర్వాత థైరాయిడ్‌ ఆ తర్వాతి స్థానంలో ఉంది. అందుకే 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళల తప్పని సరిగా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి అయితే, మూడుపదుల వయస్సు రాకముందే, థైరాయిడ్‌ బారిన పడుతున్నారు. పెళ్లి కాకముందు నుంచి కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వారికి సంతాన యోగం కలగటం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగటం ప్రధాన సమస్య.

 

Thyroid‌

సాధారణంగా థైరాయిడ్‌ అంటే ఒక హార్మోన్‌. ఇది ఎక్కువైనా, తక్కువైనా సమస్యే. ప్రారంభ దశలోనే దీన్ని గుర్తిస్తే మంచిది. కొన్ని లక్షణాలంతో థైరాయిడ్‌ని సులభంగా గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

ముఖ్యంగా బరువు తగ్గకపోవడం. ఎంత నిద్రపోయినా అలసటగా ఉండడం. నెలసరి క్రమం తప్పడం. గర్భం దాల్చలేకపోవడం. భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు, డిప్రెషన్‌ లక్షణాలు. మెడ వాపుగా ఉండటం,గొంతు బొంగురుపోవడం. చర్మం పొడిబారడం, గోళ్లు విరగడం, జుట్టు రాలడం. మలబద్ధకం, ఏకాగ్రతాలోపం, జ్ఞాపకశక్తి తగ్గడం ఇవి కూడా థైరాయిడ్‌లో భాగమే! అందుకే ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే.. వెంటనే సమస్యను పరిష్కరించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news