తాను ఇంగ్లీష్‌కు వ్యతిరేకిని కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకయ్యనాయడు జీవిత ప్రస్తానంపై రచించిన మూడు పుస్తకాలను హైదరాబాద్ గచ్చిబౌలిలో వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… ఆయా ప్రాంతీయ భాషల్లోనే ప్రభుత్వ ఆదేశాలు ఉండాలని అన్నారు. మాతృ, సోదర భాష తర్వాతే మిగిలిన లాంగ్వేజ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్యనాయుడు అన్నారు.
మాతృభాషలను కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అది చాలా గొప్ప విషయమని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. యువతలో స్కిల్ పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో పేదలున్నంతకాలం ఉచిత రేషన్ బియ్యం అందించాలని వెంకయ్యనాయుడు సూచించారు. రిఫార్మ్, పర్ ఫార్మ, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో దేశ ప్రజలకు ప్రధాని మోడీ సేవలు అందిస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి తెలిపారు.