ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోవటానికి అసలు కారణం ఇది..కోట్లల్లో వాటిల్లిన నష్టం

-

సోమవారం సాయంత్రం దాదాపు 7గంటలుపాటు ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టా సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులంతా చాలా ఇబ్బందులుపడ్డారు. కానీ ఇలా నిలిచిపోవటం వల్ల భారీ నష్టమే వచ్చిందట. వార్తలో, మన ఫ్రెండ్స్ అనుకుంటూ నిలిచిపోవటానకి కారణం సర్వర్ డౌన్ లేదా హ్యాకింగ్ కారణం కాదు. కేవలం ఓ వ్యక్తి చేసిన పొరపాటే ఈ భారీనష్టానికి కారణంగా తెలుస్తోంది.
facebook
అక్టోబర్ 4వ తేదీ సోమవారం రాత్రి.. మార్క్ జుకర్‌బర్గ్‌కు అత్యంత చేదైన రోజు అనే చెప్పాలి. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ లాభాల్లో ఉండే సంస్థకు గతరాత్రి అతి భారీ నష్టం చేకూరింది.. వాట్సప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ దాదాపు 7 గంటలసేపు నిలిచిపోయిన పరిస్థితి. తిరిగి ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో సేవలు రీస్టోర్ అయ్యాయి. అయితే ఈ బ్రేక్‌డౌన్ కు కారణంగా ఫేస్‌బుక్ సంస్థకు ఏకంగా 50 వేల కోట్లు నష్టం కలిగినట్టు అంచనా వేశారు.

ఒక మెట్టు కిందకుదిగిన జుకర్‌బర్గ్ స్థానం

mark zuckerberg

ఫేస్‌బుక్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రపంచం మొత్తం మీద ఇంతసేపు సేవలు నిలిచిపోవడం, భారీ నష్టం కలగడం ఇదే మొదటిసారట. దీని ఫలితంగా అపర కుబేరులా జాబితాలో మార్క్ జుకర్‌బర్గ్ స్థానం కూడా కిందకు పడిపోయింది. సెప్టెంబర్ మధ్యలోంచి ఫేస్‌బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా, సేవలు నిలిచిపోవడంతో మరో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్ల్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఈ నష్టం కారణంగా మార్క్ జుకర్‌బర్గ్ ప్రస్తుతం 12.9 బిలియన్ డాలర్లతో 5వ స్థానం నుంచి ఆరవ స్థానానికి చేరాడు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.
అయితే సేవలు నిలిచిపోవడానికి కారణం సర్వర్ డౌన్ అని తొలుత అంచనా వేశారు కానీ అసలు కారణం వేరే అని తెలుస్తోంది. ఫేస్‌బుక్ అనుబంధ సర్వీసులు నిలిచిపోవడంతో యూజర్ల అసహనం, వివిధ రకాల మీమ్స్ ప్రచారమయ్యాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్నె నెగెటివ్ కధనాల ప్రభావం లేదా హ్యాకర్ల పనిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇదేమీ కాదని..అలాగని సర్వర్ డౌన్ కూడా కాదని తేలింది. సాంకేతిక పరమైన సమస్యే కారణమని..ఒక వ్యక్తి పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తోంది.

ఓ ఉద్యోగి తప్పిదం వల్లే

డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఇంటర్నెట్‌కు ఫోన్‌బుక్ వంటిది. ఇందులో సమస్య తలెత్తిందని తొలుత అందరూ భావించారు. కానీ తరువాత బీజీపీ (అంటే బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్‌ను) ఓ ఉద్యోగి మ్యాన్యువల్‌గా అప్‌లోడ్ చేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని తెలిసింది. బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది. ఇది స్వయం ప్రతిపత్తి వ్యవస్థల రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేసేందుకు ఇంటర్నెట్‌కు అనుమతిస్తుంది. ఆ వ్యక్తి మ్యాన్యువల్ అప్‌లోడింగ్ చేయటంవల్ల ఇంతటి భారీ సమస్య తలెత్తినట్టు సమాచారం.

కావాలనే చేశాడా?

అయితే ఆ ఉద్యోగి ఎవరు, ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది ఇంకా స్పష్టత రాలేదు. అంతకుమించి ఆ వ్యక్తి చేసింది పొరపాటా లేదా కావాలని చేశాడా అనేది కూడా తేలాల్సి ఉంది. బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కారణంగా ఫేస్‌బుక్‌కు సంబంధించిన ప్రతి వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఫేస్‌బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు కూడా కొన్నిగంటలు పనిచేయలేదట. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీసు బయటే సిబ్బంది ఉండిపోయరని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news