వింత: ఈ మహిళ నవ్వినప్పుడల్లా నిద్రపోతుంది…!

-

బెల్లా కిల్ మార్టిన్ 24, ఈమెకి ఒక వింతైన వ్యాధి ఉంది. ఎప్పుడైతే ఆమె నవ్వుతుందో అప్పుడు ఆమె నిద్ర పోతుంది. నిజంగా ఇది చాలా వింత వ్యాధి. అయితే ఈమె ట్రీట్మెంట్ తీసుకుంటే ఈమెకి క్రోనిక్ స్లీప్ డిసార్డర్ ఉన్నట్టు తేలింది. ఆమె యుక్త వయస్సు లో ఉండేటప్పుడు cataplaxsy ఉండేది. అంటే సడన్ గా మజిల్స్ బలహీనం అయిపోతూ ఉంటాయి.

ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయో ఆ టైంలో ఇది జరుగుతుంది. బెల్లా కేసులో నవ్వు దీనికి దారి తీస్తుంది. అయితే ఆమె ఎక్కడ వుంది నవ్విన సరే వెంటనే నిద్ర పోతుంది. ఆఫీస్ లో, నైట్ క్లబ్ లో, స్విమ్మింగ్ పూల్ ఇలా ఎక్కడ నవ్వినా ఇదే పరిస్థితి. చిన్న పాటుగా నవ్వినా సరే ఆమె వెంటనే నిద్ర పోతుంది.

దీని కోసం ఆమె చెబుతూ నేను నవ్వాలి అని అనుకోవడం లేదు. కానీ కొన్ని సార్లు కంట్రోల్ తప్పి నవ్వి వీక్ అయిపోతున్నాను తర్వాత నిద్రపోతున్నాను అని ఆమె అన్నారు. మోకాళ్ళు బలహీనమై పోతాయి. చుట్టుపక్కల ఎవరు మాట్లాడినా వినబడుతుంది.

కానీ నా బాడీని నేను కదపలేను అని ఉన్నారు. 2015 లో మొట్టమొదటి ఈమె స్పెషలిస్ట్ ని కలిశారు ఈమె పరిస్థితిని చూసి ఈమె డ్రైవింగ్ చేయడం కూడా మానేశారు. ఒకసారి ఈమె హాలిడే కి వెళ్తే అక్కడ ఆమె స్విమ్మింగ్ పూల్ లో నిద్రపోయారు అని కూడా షేర్ చేసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ తన స్నేహితురాలికి తన పరిస్థితి తెలుసు కాబట్టి ఆమె స్విమ్ చేసుకుంటూ వెళ్లి ఆమెను తీసుకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version