సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గల అలనాటి ఐకానిక్ భవనాలు ఇకమీదట కనిపించవు.ఎందుకంటే సికింద్రాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది రైల్వే స్టేషన్ భవన నమూనా. నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను ఆధునికీకరణ పనుల్లో భాగంగా కూల్చివేశారు.
దీంతో నాటి కళాసంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలిపోనుంది.వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభివృద్ధి పనుల కోసం పురాతన కట్టడాలను కూల్చివేస్తున్నారు. కాగా,ప్రస్తుత రైల్వే స్టేషన్ స్థానంలో ఎయిర్ పోర్టు తరహా కొత్త మోడల్ రైల్వే స్టేషన్ డెవలప్ చేయనున్నట్లు తెలుస్తోంది.