సెల్‌ఫోన్ ఉన్న ప్రతివారు ఎక్కువగా ఉపయోగించేది గూగుల్, గూగుల్ మెయిల్, యూట్యూబ్, చాట్ యాప్స్. అయితే మీరు దాదాపుగా అన్నింట్లో జీమెయిల్‌తో లాగిన్ అవుతారు. జీమెయిల్లో లాగిన్ అయినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే అనర్థాలు జరుగుతాయి. మీ జీమెయిల్ ద్వారా మీ ఫేస్బుక్ ఖాతాలో ఎవరైనా లాగిన్ అయితే మీ పని అంతే ఇక. అందుకే మీ జీమెయిల్లో ఎవరైనా లాగిన్ అయ్యారేమో తెలుసుకోండి. అదెలాగంటే..?
మీ గూగుల్ ఖాతాలోకి వెళ్లండి. ఎడమ వైపున ఉన్న నావిగేషన్ ప్యానెల్ నుంచి “సెక్యూరిటీ” ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత “యువర్ డివైజైస్” ప్యానెల్ నుంచి “మేనేజ్ ఆల్ డివైజెస్” ఆప్షన్ ఎంచుకోండి.
ప్రస్తుతం మీరు ఏ డివైజ్ నుంచి జీమెయిల్ ఖాతాలోకి లాగిన్ అయ్యారో ఇక్కడ కనిపిస్తుంది. గత కొంత కాలం నుంచి లాగిన్ అయిన వివరాలు కూడా కనిపిస్తాయి. ఇంకా వివరాలు కావాలనుకుంటే ఆ డివైజ్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ వివరాలతో పాటు ఎప్పుడెప్పుడు ఖాతాలోంచి లాగౌట్ అయ్యామో కూడా తెలుసుకోవచ్చు. మన ఖాతా గురించి పూర్తి వివరాలు తెసుకునేందుకు గూగుల్ మనకు సహకరిస్తుంది. ఒకవేళ లాగిన్ అయింది మీరు కాకుంటే ఇక్కడ నుంచి సైన్ ఔట్ కావచ్చు.
కొన్నిసార్లు మనం అనుకోకుండా మెయిల్ సెండ్ చేస్తాం. ఆ పొరపాటును సరిదిద్దుకునేందుకు జీమెయిల్లో అండూ ఆప్షన్ ఉంటుంది. అయితే ఇందుకోసం మనం డిలే సమయాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలోగా మనం అండూ క్లిక్ చేస్తే ఆ మెయిల్‌ను అవతలి వారు చూడలేరు.
జీమెయిల్ వెబ్సైట్ ఓపెన్ చేసి, ఎడమవైపున ఉన్న ‘గేర్’ ఐకాన్ పై క్లిక్ చేయండి.⦁ అందులో ‘సెట్టింగ్స్’ను సెలెక్ట్ చేసుకోండి.⦁ తర్వాత జనరల్ ట్యాబ్‌లో ‘అండూ సెండ్’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.⦁ అనంతరం అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో 5 సెకన్లు, 10 సెకన్లు, 20 సెకన్లు, 30 సెకన్లు అని కనిపిస్తుంది. అక్కడ టైమ్ సెట్ చేసుకోండి. తర్వాత ‘సేవ్ ఛేంజెస్’ అనే బటన్‌పై క్లిక్ చేయండి.