మైగ్రేన్ తలనొప్పి తీవ్రంగా వస్తుంటే.. పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

-

సరైన జీవనశైలి లేకపోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే, కొంతమంది ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలను పాటిస్తూ వాటిని తగ్గించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా, మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలు ఎదురైనప్పుడు కొంతమంది ఇంట్లో తగిన నివారణ తీసుకుని అనారోగ్య సమస్యలను తగ్గించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఎక్కువగా తలనొప్పి వస్తుందో, ఆ తీవ్రతను తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా, ప్రశాంతకరమైన వాతావరణంలో ఉండాలని కోరుకుంటారు. మైగ్రేన్ తలనొప్పిని ఎదుర్కొన్నప్పుడు ఇంట్లో కొన్ని చిట్కాలను పాటిస్తే వెంటనే దాన్ని తగ్గించుకోవచ్చు.

తలనొప్పి వచ్చినప్పుడు డీహైడ్రేషన్ ఎంతో అవసరం. కనుక, మంచినీరు ను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటుగా, తలకు కోల్డ్ కంప్రెస్ వేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. కోల్డ్ కంప్రెస్ ను తలకు ఉపయోగించడం వలన రక్తనాళాలు సంకోచించి నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా, మెడ వెనుక భాగంలో వెచ్చగా ఉండే కంప్రెస్ ను ఉపయోగించాలి. దీంతో, కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ విధంగా నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు వికారం వంటి లక్షణాలను కూడా ఎదుర్కొంటారు. అటువంటి సమయంలో, అల్లం టీ ను తాగడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది.

అంతేకాకుండా, లావెండర్ ఆయిల్ ను వాసన చూడటం లేక తలకు మసాజ్ చేయడం వలన మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. చాలా శాతం మంది మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు ఆహారం లో మార్పులు వలన ఇబ్బంది పడటం, వాతావరణం లో మార్పుల వలన తలనొప్పిని ఎదుర్కోవడం వంటివి జరుగుతాయి. కనుక అటువంటి వారు చల్లటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటిని తీసుకోవడం వలన మైగ్రేన్ సమస్య ఎక్కువ అవుతుంది అని నిపుణులు చెబుతున్నారు. కనుక, ఇటువంటి చిట్కాలను ఇంట్లోనే పాటించి మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news