కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా రేపు, ఎల్లుండి బందు చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రైవేటీకరణ పాలసీని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా బ్యాంకింగ్ సెక్టార్ ఈ సమ్మెలో పాల్గొంటుoది..
దీంతో బ్యాంకింగ్ సర్వీసును ప్రభావితం అవుతాయి అని ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి. రేపు, ఎల్లుండి బందు నేపథ్యంలో ముందస్తుగానే తమ కస్టమర్లు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
లాభాలలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్రపూరితంగా అని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. ఈ మేరకే తాము బందు నిర్వహిస్తున్నామని… దీనికి ప్రజలందరూ సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి. రోడ్డు రవాణా మార్గాలను చెందినవారు, విద్యుత్ కార్మికుల ఈ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ రెండు రంగాల సర్వీసులపై కూడా భారత్ బంద్ ప్రభావం ఉంది.