మార్నింగ్ లేవగానే కాకపోయినా.. కాస్త లేటుగానే అందరూ చేసేపని పళ్లు తోముకోవడం.. టూత్ పేస్ట్‌ను పళ్లు తోముకోవడం కోసమే అని చాలామంది అనుకుంటారు.. కానీ చాలా రకాలుగా టూత్ పేస్ట్‌ను వాడుకోవచ్చు తెలుసా.. ముఖ్యంగా అమ్మాయిలు.. మొటిమలకు, మోకాళ్ల మీద నలుపు, మెడ మీద నలుపు పోగొట్టుకోవాడనికి కూడా టూత్‌పేస్ట్‌ను వాడుతుంటారు. ఇంకా ఇవి కాకుండా టూస్‌పేస్ట్‌తో ఇంకా చాలా పనులు చేయొచ్చు.. అవి ఏంటో సరదాగా ఓ లుక్కేయండి..!
పిల్లలు ఇంట్లో గోడలపై క్రేయాన్స్‌తో గీతలు గీస్తుంటారు. ముందుగా టూత్ పేస్ట్‌తో రుద్ది తరువాత తడి బట్టతో శుభ్రం చేయాలి. దీంతో గోడలపై ఉండే గీతలు, మరకలు పోతాయి.
ఐరన్ బాక్స్‌కి దుస్తులు అంటుకుని మరకలు పడితే వాటిని టూత్ పేస్ట్‌తో పోగొట్టవచ్చు. పేస్ట్‌ను రుద్ది తరువాత వస్త్రంతో శుభ్రం చేయాలి. దీంతో మరకలు పోతాయి.
టూత్‌పేస్ట్‌తో ఫర్నిచర్‌పై పడిన మరకలను తొలగించుకోవచ్చు. టప్పర్‌వేర్ బాక్స్‌లను క్లీన్ చేయవచ్చు. కిచెన్ సింక్ ను కూడా శుభ్రం చేసుకోవచ్చు
కళ్లకు ధరించే అద్దాలపై మరకలు ఉంటే కొద్దిగా పేస్ట్‌ను రాసి మొత్తం అప్లై చేయాలి. తరువాత తడి బట్టతో తుడవాలి. దీంతో అద్దాలు క్లీన్‌గా మారుతాయి. చక్కగా కనిపిస్తాయి.
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లపై టూత్ పేస్ట్‌ను కొద్దిగా రాసి తరువాత డిస్‌ప్లే మొత్తం తడిబట్టతో తుడవాలి. దీంతో డిస్‌ప్లే క్లీన్ అవుతుంది. శుభ్రంగా మారి మెరుస్తుంది. దృశ్యాలు బాగా కనిపిస్తాయి.
కారు హెడ్ లైట్స్‌ను తుడిచేందుకు కూడా పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. కొద్దిగా పేస్ట్‌ను తీసుకుని స్పాంజ్‌పై వేసి దాంతో కారు హెడ్ లైట్స్‌ను వృత్తాకారంలో తుడవాలి. అనంతరం తడి బట్టతో తుడవాలి. దీంతో హెడ్ లైట్స్ శుభ్రంగా మారి మెరుస్తాయి. కాంతి బాగా వస్తుంది.
షూస్ వాసన వస్తుంటే టూత్ పేస్ట్‌ను అక్కడక్కడా రాసి శుభ్రం చేయాలి. దీంతో షూస్‌లో ఉండే వాసన పోతుంది.
కీటకాలు, పురుగులు కుట్టిన చోట పేస్ట్‌ను రాసి మర్దనా చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి.
టూత్‌పేస్ట్‌తో గోళ్లను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో గోళ్లు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వెండి ఆభరణాలను శుభ్రం చేస్తే అవి తళతళా మెరుస్తాయి.