అమిత్ షా డైరెక్ష‌న్ లో కేసీఆర్ న‌టిస్తున్నాడు : రేవంత్ రెడ్డి

-

కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా డైరెక్ష‌న్ లో కేసీఆర్ న‌టిస్తున్నాడుని.. ఇద్ద‌రివి నాట‌కాలు ఆడుతున్నార‌ని తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పార్ల‌మెంట్ లో టీఆర్ ఎస్ ఎంపీలు డ్రామాలాడార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బుధ‌వారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ నేత‌లు కొత్త నాట‌కాల‌కు తెర‌తీస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థించ‌డానికే.. పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించి.. గ్రామాలకు వెళ్లార‌ని టీఆర్ ఎస్ ఎంపీల‌పై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. యాసంగి పంట పై స్ప‌ష్టత ఇవ్వాల‌ని కోర‌లేద‌ని మండిప‌డ్డారు. వానా కాలం పంట కొంటామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ముందే చెప్పింద‌ని గుర్తు చేశారు. ఏప్రిల్ లో వ‌చ్చే పంట కొనుగోలే రైతుల రైతుల అస‌లు స‌మ‌స్య అని.. పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం నుంచి క్లారిటీ వ‌చ్చే దాకా కొట్లాడాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version