టీ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ స్థానాల సమీక్షకు పలువురు నేతలు గైర్హాజరయ్యారు. ఈరోజు గాంధీ భవన్ లో సభ్యత్వ నమోదుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమావేశం అయింది. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సభ్యత్వాల గురించి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఏఐసీసీ ఇచ్చిన 30 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్ కు అనుగుణంగా… టీపీసీసీ ఈ సమావేశం నిర్వహిస్తోంది.కాగా.. మొదటగా మెదక్ స్థానం గురించి సమీక్షా సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కీలక నేతలు రాలేదు. మెదక్ పార్లమెంట్ కు సంబంధించి కీలక నాయకులు జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డిలు హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. టీపీపీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినప్పటి నుంచి ముఖ్యంగా జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహలు అసంత్రుప్తిగా ఉన్నారు. పార్టీకి సంబంధించి పలుమార్లు సమావేశాలకు హాజరుకాలేదు.
టీ కాంగ్రెస్ కీలక భేటీ… పలువురు కీలక నాయకులు డుమ్మా.
-