Breaking News: రేపు ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు..

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య వజ్రోత్సవాల పేరిట వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్‌ వేవ్‌ కనిపిస్తోంది. రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాలు మొదలూ ఫ్లైఓవర్లు, ప్రధాన కూడళ్లలో వజ్రోత్సవ వేడుకల శోభ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. శనివారం ట్యాంక్‌బండ్‌పై స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్న త్రివర్ణ బెలూన్ల కార్యక్రమం దృష్ట్యా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

Sunday to be 'Funday' at Hyderabad's Tank Bund as HMDA plans activities,  laser show | Cities News,The Indian Express

ట్యాంక్ బండ్ – తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు అంబేద్కర్ విగ్రహం – ఇక్బాల్ మినార్, లిబర్టీ – హిమాయత్‌నగర్, కవాడిగూడ వైపు సెయిలింగ్ క్లబ్ – డీబీఆర్ మిల్స్ – లోయర్ ట్యాంక్ బండ్ – కట్ట మైసమ్మ – తెలుగు తల్లి ఫ్లైఓవర్, గోశాల వైపు డిబిఆర్ మిల్స్ – కవాడిగూడ – జబ్బార్ కాంప్లెక్స్ – బైబిల్ హౌస్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు పాత సచివాలయం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు.. పార్కింగ్ స్థలాలు.. ఎన్టీఆర్ ఘాట్ రోడ్డు మరియు కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్. లోయర్ ట్యాంక్ బండ్ స్లిప్ రోడ్డు, ఎన్టీఆర్ స్టేడియం, బుద్ధ భవన్ రోడ్ మరియు నెక్లెస్ రోడ్ ప్రాంతాలలో తమ వాహనాలను పార్కింగ్‌ చేసుకోవచ్చని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news