వరంగల్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లాల్సిందే..!

-

ఇవాళ వరంగల్‌ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో మహాశివరాత్రి సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ములుగు, పరకాల నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలు ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, సీపీవో నుంచి అంబేడ్కర్ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్టాండ్ కు చేరుకోవాలి.హనుమకొండ నుంచి ములుగు, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు శ్రీదేవి ఏషియన్మాల్, అంబేడ్కర్ సెంటర్, సీపీవో పాయింట్ నుంచి కేయూసీ మీదుగా వెళ్లాలి.

హనుమకొండ బస్టాండ్ నుంచి నర్సంపేట, తొర్రూరు, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలు బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలి. వరంగల్ బస్టాండ్ నుంచి పోస్టాఫీస్, శివనగర్, పోతనరోడ్డు, సంతోషిమాత దేవాలయం, సీఎస్ఆర్ గార్డెన్, అదాలత్ నుంచి. హనుమకొండ, ఇతర ప్రాంతాలకు వెళ్లాలి. ములుగు క్రాస్ రోడ్డు నుంచి హనుమకొండకు.. అలంకార్, కాపువాడ మీదుగా వెళ్లాలి. హనుమకొండ నుంచి వరంగల్ వైపునకు.. మార్కజీ పాఠశాల, కొత్తూర్ జెండా మీదుగా పెద్దమ్మగడ్డ ద్వారా చేరుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news