ALERT : హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు..వివరాలు ఇవే

-

నేడు శ్రీరామ నవమి ఉత్సవాలు హైదరాబాద్‌ లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సిటీలో జరగబోయే శోభా యాత్ర పై పోలీసులు ఫోకస్‌ పెట్టారు. పాతబస్తీ లో జరిగే శోభా యాత్రకు భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. అయితే.. శోభా యాత్ర సాగే ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. సీతారాంబాగ్‌ ఆలయం నుంచి స్టార్ట్‌ అయ్యే యాత్ర… సుల్తాన్‌ బజార్‌ లోని హనుమాన్‌ వ్యాయామశాల దగ్గర ముగియనుంది.

అయితే.. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా వెహికల్స్‌ ను దారి మళ్లీంచేలా ప్లాన్‌ చేసింది పోలీస్‌ సిబ్బంది. ఆసీఫ్‌ నగర్‌ నుంచి వచ్చే వెహికిల్స్‌.. బోయిగూడ కమాన్‌ నుంచి మల్లెపల్లి వైపు.. బోయిగూడ కమాన్‌ నుంచి సీతారాంబాగ్‌ వెళ్లే వాహనాలను ఆగాపూరా వైపు మళ్లీస్తారు. ఆగాపురా, హబీబ్‌ నగర్‌ నుంచి దారుస్సలామ్‌ వైపునకు మళ్లీస్తారు. అఫ్జల్‌ గంజ్‌ నుంచి సిద్ది అంబల్‌ బజార్‌ వైపునకు వెళ్లే వాహనాలు సాలార్‌ జంగ్‌ బ్రిడ్జ్‌ మీదుగా మళ్లీస్తారు. గౌలిగూడ చమన్‌ వచ్చే వాహనాలను జాంబాగ్ వైపునకు మళ్లీంచనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news