వీకెండ్ విండో : ద మిథ్‌ – ద సెక్స్‌

-

తేనెతుట్టె లాంటి ప్రేమ చేదు నిజం ఇచ్చి పోతుంది..పలుకు తేనెలను తాగి పెదవుల పందేరాల్లో ఓడిపోయిన ప్రేమ..జీవిత రహదారుల్లో ఒంటరిని చేస్తుంది..మౌనం దగ్గర శృంగారం ఓడిపోయి దేహాలను ఊడిగం చేయిస్తుంది..మాట దగ్గర క్షణికానందం పొంది ప్రేమ నెగ్గి దేహం ఓడిపోతుంది..ఓడిపోయే దేహాలకు విలువ ఉంటుందని అనుకోలేం..చర్యలను ఆస్వాదించాక మధ్యమావస్థల్లో జీవితాలను ఒడ్డుకు చేర్చలేం.అందుకనో/ఎందుకనో శృంగారం ఓ నగ్నంగా తోచిన సత్యం.. ప్రేమ ఓ విషాదాన్ని మిగిల్చిన వాస్తవం.. ప్రేమ రద్దయ్యాక అవసరాలో/అంచనాలో పలకరిస్తాయి మీ బిడ్డల అంచనాల ను అందుకోండి మరి!బిడియ పడిన సందర్భాలను రాతిరి రహదారుల్లో త ల్చుకుని తెల్లారింటికి ఉస్సూరుమనండి ..

 

ఓ ఒంటరి చందమామా! నీ వెన్నెల దాహాలను అందించి నగ్న సౌందర్యాల చి త్తాలను భోదించి మా అనుసంధానతకు తొలి సాక్షి సంతకం చేసిపో…కొన్ని పూ ల పరిమళాలనూ ప్రహేళికలనూ ప్రేలాపలనలనూ ఊపిరి దారులలో దాచేశాక జీవితేచ్ఛకు కొనసాగింపు వెతకాలిక..ప్రేమ వాక్యం..శృంగారం కావ్యం..ప్రేమ యుద్ధారంభం శృంగారం వంచనకు చోటిచ్చిన యథార్థవాదం..కానీ ఎందుకనో ఆ లోకవిరోధి అందరికీ చేరువ..హాహాహా…రేయంతా నీడలు పరస్పర సాహ చ ర్యంలో మాయంటావా మిథ్యంటావా????..నథింగ్‌ ఎల్స్‌ …నో మార్‌ టాక్స్‌

ఆర్జీవీ ఇలా అంటున్నాడు దేవుడు అంటే ఇష్టం శృంగారం అనే చర్యను స్త్రీ అనే రూపాన్ని సృష్టించాడు కనుక..దేవుడంటే ద్వేషం..నిజాయితీ లేని శృంగారాన్ని పరిచయం చేసి నీతి మాలిన బతుకులకు ప్రేమని అందించాడని..అంటాన్నే ను.. మనిషేనా వీడు??మృగాలు-మనుషులు ఒకటి వెలుగులో ఒకటి చీక టింట్లో చేసుకునే చర్యలకు నిజాయి తీని పట్టి చూడలేం.దేహ వాంఛల్లో అం తర్లయలను,ధ్వని తీవ్రతలనూ పట్టి చూడలేం కనుక ప్రేమ మిథ్‌ శృంగారం మి రాకిల్‌ .. మిథ్‌ అండ్‌ మిరాకిల్స్‌ ఆర్‌ నెవర్‌ ఛేంజ్‌ సమ్‌ టైమ్స్‌ ..

మరబొమ్మలన్నీ మనిషి కన్నా గొప్పగా తోచాయి. వివేకం లోపలి పొరల్లో దాచి వినయం నటించు మనుషులంటే అవి భిన్నంగా ఉన్నాయి.కొన్నిసార్లు కొన్ని పొగ మేఘావృతాలు ఇష్టంగా తోచాయి..ప్రేమ కూడా కరగని కన్నీటి మేఘం కా వొచ్చు.ఇష్టంగా తోచిన వ్యక్తి ఇష్టంగా కడదాకా ఉండకపోనూవచ్చు.కనుక దే హచర్యలలో ఇష్టాలు వెల్లడికి నోచుకుంటాయి.. జీవిత ఎదురీతల్లో చెల్లుబాటు కాని ఇష్టాలు ముఖం చాటేస్తాయి.ప్రేమ-శృంగారం వెల్లడికాని నిజాలు.. కొన్నిం ట.. కొన్ని పొరలను తొలగించాక నిజాల ఆవిష్కరణ నమ్మకాలను వమ్ము చే స్తాయి..విశ్వాసాలను రద్దు చేస్తాయి..నేల కింద నేల నెత్తి మీద నింగి వాస్తవా లను భోదిస్తాయి.కనుక కొన్ని శృంగార చర్యలు కూడా నిజాయితీని కలిగి ఉం డవు. చీకట్లో లేని నిజాయితీ వెలుగులోకి వచ్చాక పొందాలను కోవడం అవివే కం.కనుక చీకటి నిజం చీకటి చెంత దాచేసిన నిజం వెలుగులో అబద్ధం. ప్రేమ శృంగారం పరస్పర ఆధారితం. ఒక భావోద్వేగం రద్దయితే మరో భావోద్వేగం అ వసరాలను పోగేసి ప్రేరణ చర్యగా మారుతుంది. భావోద్వేగాలు దేహావసరాలు తరువాత కాలంలో నిజాలను వెల్లడిస్తాయి. నీతిని భోదిస్తాయి సంబంధిత ప రిణామాలు వినడం ఆచరించడం మనం ఎవ్వరం చేయని పని..హాహాహా…

పదునైన ఆయుధాలకు పదునైన ఇజాలను బలి చేయడం బాగా అలవాటు ఈ ప్రపంచానికి..ఆయుధంగా దేహాన్ని మలిచి గాయాలను కోరి తెచ్చుకోవడం అ లవాటు కాని అలవాటు ఇంకొందరికి..శుద్ధతని ప్రామాణికంగా మలిచి అనం త అవధిని చేరుకోవాలనే తాపత్రయం అన్నింటా నెగ్గుతుందనుకోను. ప్రేమ శుద్ధ తకు ఆనవాలు అని అంటానా..తెలివి తక్కువ చర్యలకు ఊహావేగం ఎక్కువ ..

ఎరుపెక్కిన పెదాలను ముద్దాడి చెబుతున్న వాస్తవమిది..ప్రేమని పరిపరి వి ధాల కొలిచి వాంఛ తీవ్రతకు అది అడ్డంగా భావిస్తే అవివేకం..అవివేకాన్ని బదు లుగా ఇచ్చి దేహ వాంఛలను తీర్చుకోవడం శుద్ధ దండగమారి పని.. కొన్నింట ప్రేమ మాయ శృంగారం అత్యంత నిజాయితీతో కూడుకున్న పని..

శృంగార చర్యలకు అంగీకారం నోచుకోని ప్రేమలకు అస్సలు సంబంధమే ఉండ దు కదా..సాంసారిక యోగం అన్నది జీవితాన కదిపి కుదిపేస్తున్నప్పుడు కల్లో లితం ఓ అంచనాకు కుదరని స్థితి..మనుషులు దేహ బంధాలను నగ్న సౌంద ర్యాలకు తాకట్టు పెట్టి రేయి గడప దాటి,తూరుప వాకిట చేరుకుంటే చాలు అ నుకుంటే అదే కదా అవివేకం..బదులుగా ఇవ్వాల్సిన వాటికి బదులుగా కోరు కోవాల్సిన వాటికి ప్రతినిధిగా ప్రేమ ఎందుకు ఉంటుందో అర్థం కావ డం లేదు. కనుక శృంగారం నిజం ప్రేమ అబద్ధం.

కొన్నిసార్లు ప్రేమలో చెప్పేవాటికి పరమావధి ఏమీ ఉండదు.. ఆచరణకు తూ గని మాటలకు ఆనవాలుగా రెండు జీవితాలు నిలిచి ఓడిపోతాయి.ఒడ్డున కూ ర్చొని అంచనా వేసి సుఖమయం అయే రేపటిని జీవితాన ఆహ్వానించడం తె లివి లేని పని.జీవితాన శృంగారాన్ని ప్రేమ వ్యసనంగా మారుస్తుంది. ప్రేమ పే రిట జరిగే శృంగారం పరస్పర అంగీకారంలో మునిగి తేలుతుంది. కనుక నగ్న దేహాలకు నగ్న సత్యాలు అర్థం కావేమో!

కొన్నిచర్యలు దాడులను నియంత్రిస్తాయి..కొన్ని ప్రేమలు దాడులను ప్రేరేపి స్తాయి…ప్రేరణగా నిలిచేవి కలకాలం ఉంటాయా? కలకాలం అనేదే పెద్ద చిక్కు … ముడి వీడాక జీవితం ఓ భ్రాంతి.. ఒకరితో అంటున్నా ప్రేమ రాహిత్యమే ప్ర మాదం అని..నైరాశ్య సంబంధ నిశ్వాసల జాడల్లో ఓ అనునయంగా తోచిన సం దర్భం ఆమె కానప్పుడు ప్రేమ ఓ జీవ సమాధి..క్షణికంగా తోచిన ఆవేశం శృం గారం దేహాలను పరమ పవిత్రంగా ఉంచవు కదా.. కనుక జీవితేచ్ఛను తాకట్టు పెట్టే ప్రేమ ప్రమాదకరం.

– రత్నకిశోర్‌ శంభుమహంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి…

Read more RELATED
Recommended to you

Latest news