సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం.. ప్రాథమిక రిపోర్టులో కీలక అంశాలు

-

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. సిగ్నల్ తప్పిదం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో వెల్లడించింది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిందని వివరించింది. మొదట మెయిన్ లైన్ పై వెళ్లేందుకే కోరమాండల్ కు సిగ్నల్ ఇచ్చారని, కానీ ఆ తర్వాత తీసేశారని పేర్కొంది. అలా ఎందుకు జరిగిందన్నది మాత్రం నివేదికలో వివరించలేదు. మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి వెళ్లిందని రైల్వే శాఖ పేర్కొంది.

రైలు ప్రమాదం నిన్న సాయంత్రం 5:55 గంటలకు సంభవించిందని సాయంత్రం 6:50 కి హౌరా ఎక్స్ ప్రెస్ రైలు బహనాగా స్టేషన్ దాటగా.. కోరమండల్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం. 6:50కు ఖాంతాపార స్టేషన్ దాటిందని నివేదిక పేర్కొంది. గూడ్స్ ట్రైన్ ను కోరమండల్ ఢీ కొట్టడంతో దాని బోగీని మరో ట్రాక్ పై పడ్డాయని దాంతో ఆ ట్రాక్ పై వస్తున్న హౌరా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైనట్లు వెల్లడించింది. మరో వైపు ప్రమాదం ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version