వరంగల్ ఈస్ట్ లో త్రిముఖ పోరు?

-

గతంలో కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అడ్డాగా ఉన్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరగడం..అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపడుతున్న నేపథ్యంలో వరంగల్ ఈస్ట్ లో పోరు మారిపోయేలా ఉంది. అయితే 2014, 2018 ఎన్నికల్లో ఈస్ట్ లో టీఆర్ఎస్ వన్ సైడ్ గా గెలిచేసింది.

2014లో ఈస్ట్ నుంచి టీఆర్ఎస్ తరుపున కొండా సురేఖ విజయం సాధించారు. దాదాపు 55 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే 2018 ఎన్నికల సమయంలో కొండా ఫ్యామిలీకి సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు…దీంతో సురేఖ మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. దీంతో ఈస్ట్ నుంచి టీఆర్ఎస్ తరుపున నన్నపునేని నరేందర్ పోటీ చేశారు. అటు కాంగ్రెస్ నుంచి రవిచంద్ర పోటీ చేశారు. అనూహ్యంగా 28 వేల ఓట్ల మెజారిటీతో నరేందర్ గెలిచారు. బీజేపీకి కేవలం 4 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

అయితే ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ పై నిదానంగా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది…ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు పెద్దగా సంతృప్తిగా లేరు. ఇదే సమయంలో అక్కడ టీఆర్ఎస్ లో బలమైన నేతగా ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు..బీజేపీలోకి వచ్చేస్తున్నారు.  ప్రదీప్…మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు అని అందరికీ తెలిసిందే. ఈయన గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఈస్ట్ లో రెండో స్థానంలో నిలిచారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరినా సరే సీటు దొరకలేదు.

ఇక ఇప్పుడు ఆయన బీజేపీలోకి వస్తున్నారు…అలాగే నెక్స్ట్ ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అటు కొండా సురేఖ సైతం ఈ సారి ఈస్ట్ నుంచి పోటీ చేయడం ఖాయమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పరకాలల పోటీ చేసి ఓడిపోయిన సురేఖ…ఈ సారి ఈస్ట్ బరిలో ఉంటారని కొండా మురళీ కన్ఫామ్ చేశారు. అటు ప్రదీప్, ఇటు సురేఖ ఎంట్రీతో వరంగల్ ఈస్ట్ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ సారి అక్కడ టఫ్ ఫైట్ నడిచేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news