దొంగలు దొరికారు.. నరేష్ – పవిత్ర పై నెటిజన్స్ ట్రోల్స్..!!

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమ.. పెళ్లి.. విడాకులు..
సహజీవనం ఇలా రకరకాల చేష్టలు చేస్తూ చాలామంది ఇండస్ట్రీ పరువు పోగోడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే చాలామంది హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దాలను ప్రయత్నం చేస్తుంటే.. మరి కొంతమంది వ్యక్తిగత విషయాలలో నానా అల్లర్లు చేసుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీని అత్యంత దారుణంగా మారుస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే వీకె. నరేష్ , ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం రోజు రోజుకు తెలుగు సినీ పరిశ్రమను అందరూ నీచంగా చూసేలా చేస్తోంది.

అసలేమిటంటే ప్రముఖ నిర్మాత, దర్శకురాలు, నిర్మాత అయినటువంటి విజయనిర్మల తన మొదటి భర్తకు జన్మించిన వారే నరేష్.. 19 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రుల కోరిక మేరకు వివాహం చేసుకున్నారు . ఆ తర్వాత అనారోగ్య సమస్యతో వున్న ఆమెకు విడాకులు ఇచ్చి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నారు .ఆమెతో కూడా జీవితాన్ని కొనసాగించలేక కాంగ్రెస్ మాజీ నాయకుడు రఘువీరారెడ్డి బ్రదర్ కూతుర్ని రమ్యా రఘుపతిని మూడో వివాహం చేసుకున్నాడు. ఇకపోతే ఈమె గురించి గతంలో చాలా గొప్పగా చెప్పిన నరేష్ .. ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా అపవిత్రురాలు అంటూ ఆమెపై నిందారోపణలు చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నాడని వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేషన్ ను ఎలా వివాహం చేసుకుంటాడు అంటూ మీడియాతో పెద్ద ఎత్తున నరేష్ పై ఆరోపణలు చేసింది.. అంతేకాదు ఇటీవల పవిత్ర లోకేష్, నరేష్ లను ఒకే హోటల్లో ఒకే గదిలో ఉండడంతో మీడియాతో సహా ఆమె అక్కడికి వెళ్లి వారిని పట్టించడం జరిగింది. ఇక ఇలా వీరి ముగ్గురిపై రకరకాల వార్తల వైరల్ అవుతున్న నేపథ్యంలో నరేష్ అలాగే పవిత్రలోకేష్ విడివిడిగా వీడియోలు వదలడం జరిగింది.

పాపం పిచ్చివాళ్లు..సెలబ్రిటీలు ఏం చేసినా సరే జనాలు చూసేస్తారు అనుకున్నారో ఏమో.. కానీ ఇటీవల వీరు వదిలిన వీడియోల వల్ల దొంగలు దొరికారు అంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరు కూడా విడివిడిగా వీడియోలు వదిలినప్పటికీ , ఒకే రూమ్లో కూర్చొని వీడియోలు చేసినట్లు వారి వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ అలాగే వారు కూర్చున్న సోఫా చెబుతున్నాయి. రెండు ఒకేలాగా ఉండడంతో పెద్ద ఎత్తున వీరిపై మీమ్స్ ట్రోల్స్ సృష్టిస్తూ నెటిజన్స్ వీరిపై దాడికి దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు మీమ్స్, ట్రోల్స్ అన్నీ కూడా నెట్ బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version