తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ నడుస్తూనే ఉంది..రోజురోజుకూ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు…చేతల యుద్ధం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరినొకరు తిట్టుకునే స్టేజ్ నుంచి…ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్టేజ్‌కు కారు-కమలం నేతలు వెళ్ళిపోయారు. ఆ రెండు పార్టీల మధ్య వార్ మరింత పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇప్పటికే అనేక అంశాల్లో రెండు పార్టీల మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దళితులకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఇంకా వారిని మోసగిస్తూనే ఉన్నారని, ప్రగతి భవన్‌ను ఏడాదిలోపే నిర్మించుకున్నారని, సెక్రటేరియట్ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, మరి ఆరేళ్లయినా అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు పనులను ఎందుకు పూర్తిచేయలేదని బండి ప్రశ్నించారు.
అయితే బండి వెళ్ళిన ప్లేస్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ వెళ్ళి.. బీజేపీ నేతల రాకతో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రాంగణం అపవిత్రమైందంటూ ఆ ప్రదేశాన్ని పాలతో శుద్ధి చేశారు. అసలు బీజేపీ నేతలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటే గిట్టదని, ఉత్తరాది రాష్ట్రాల్లో దళిత వర్గాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని ఈశ్వర్ ఆరోపించారు.
ఇక ఇక్కడ బండి సంజయ్ లాజిక్‌లు కరెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి..టీఆర్ఎస్ తమకు కావల్సిన పనులని త్వరగానే పూర్తి చేసుకుంటుంది…ఉదాహరణకు ప్రగతి భవన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకున్నారు. మరి అంబేడ్కర్ స్మృతివనం మాత్రం పూర్తి చేయడం లేదు. కానీ దళితుల ఓట్లు కొల్లగొట్టడానికి స్మృతివనం పేరుతో కాలక్షేపం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య వార్ ఆగేలా లేదు.