విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి గా యశ్వంత్ సిన్హా ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కేసీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, బి బి పాటిల్, వెంకటేష్ నేత, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. కాగా ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పో లింగ్, 21వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఈనెల 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. జూలై 21 లోగా ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24వ తేదీన ముగియనుంది.