తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖారారు చేసిన సంగతి తెలిసిందే. గతంలో బండ ప్రకాష్ రాజీనామాలో ఏర్పడిన రాజ్యసభ స్థానంతో పాటు పదవీ కాలం ముగిసిన డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంత రావు స్థానాల్లో కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. వద్దిరాజు రవిచంద్ర, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, హెటిరో ఫార్మా చీఫ్ పార్థసారధి లకు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసింది.
ఇదిలా ఉంటే బండ ప్రకాష్ రాజీనామా చేసిన స్థానంలో వద్దిరాజు రవిచంద్ర( గాయత్రి రవి)కి టీఆర్ఎస్ అవకాశం కల్పించింది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. మరో రెండేళ్ల పాటు ఆయన ఎంపీగా ఉండనున్నారు. రవిచంద్రకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందచేశారు. రవిచంద్రతో పాటు సమాజ్ వాదీ పార్టీకి చెందిన భాస్కర్, స్వతంత్ర అభ్యర్థి భోరజ్ కొయాల్కర్ నామినేషన్లు దాఖలు చేయాగా… వీరి నామినేషన్లు సరిగ్గా లేకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో వద్దిరాజు ఎన్నిక ఏకగ్రీవం అయింది. వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఏదో ఒక పదవిని ఆశిస్తున్నారు. తాజాగా కేసీఆర్ ఆయన్ను రాజ్యసభ స్థానానికి ఎంపిక చేశారు.