Ukrain crisis : రష్యాకు మద్దతు ప్రకటించిన ట్రంప్ !

-

రష్యాను అడ్డుకునేందుకు పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య ఉక్రెయిన్ నలిగిపోతుంది. అయితే ఈ పరిస్థితిని అదుపు చేయడానికి అత్యవసర పరిస్థితి విధించాలని సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య వివాదం మరింత తీవ్రం కావడంతో ఉక్రెయిన్ పై దండెత్తడానికి రష్యా అన్ని విధాలుగా సిద్ధమయింది. రెండు దేశాల మధ్య యుద్దం కొనసాగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ పై దాడిని ఖండిస్తూనే… రష్యాకు మద్దతు తెలిపారు డోనాల్డ్ ట్రంప్. “ఉక్రెయిన్‌పై రష్యా దాడి భయంకరమైనది. ఇది ఎప్పటికీ జరగకూడని దౌర్జన్యం, చాలా దారుణం. ఇది ఎప్పుడూ జరగలేదు. ఉక్రెయిన్ ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాము” అని కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (CPAC)లో ట్రంప్ అన్నారు.

అలాగే.. ఉక్రేయన్ ప్రెసిడెంట్ వోలోడ్‌మిర్ జెలెన్స్కీని ధైర్యవంతుడని ప్రశంసిస్తూ, ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్‌తో తన స్నేహపూర్వక సంబంధాన్ని కూడా నొక్కిచెప్పారు. అయితే ఉక్రేయన్ కు అమెరికా మద్దతు తెలపడాన్ని వ్యతిరేకించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news