ప్రశాంతంగా ముగిసిన ఈ సెట్‌

-

తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్-23) ఎగ్జామ్‌ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు మొత్తం 96.53 శాతం మంది విద్యార్థులు హారయ్యారని శనివారం ఈసెట్ కన్వీనర్ శ్రీరామ్ వెంకటేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సెట్ ఎగ్జామ్‌ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహినట్లు వెల్లడించారు.

TS ECET 2023 exam date announced; check schedule here

తెలంగాణలోని కేంద్రాల్లో 20,517 మంది, ఆంధ్రప్రదేశ్ సెంటర్లలో 1937 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రకటించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి సారథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు. పూర్తిగా అన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించామని తెలిపారు. లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌, బీఎస్‌సీ మ్యాథ్స్‌ పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా బీటెక్‌, బీఫార్మసీలో చేరేందుకు ఏటా ఈసెట్‌ను నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news