TSPSC పేపర్ లీకేజీ.. రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

-

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్‌ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో నిందితుడు రాజశేఖర్ ఇంట్లో మరోసారి సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మరికొన్ని క్వశ్చన్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పరీక్ష రాసిన గోపాల్, నీలేశ్‌ ఇద్దరికీ నీలేశ్‌ సోదరుడు రాజేంద్ర నాయక్ డబ్బులు సమకూర్చినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కేతావత్ శ్రీనివాస్ ద్వారా మరికొంత నగదు ఇప్పించారని గుర్తించినట్లు సమాచారం. నీలేష్, గోపాల్ పరీక్ష రాయగా.. పేపర్ ఇచ్చినందుకు రూ.14 లక్షలు సమకూర్చినట్లు తేల్చారు.

నిందితుల 6 రోజుల కస్టడీలో భాగంగా నేడు నాలుగో రోజు సిట్‌ అధికారులు విచారణ చేస్తున్నారు. మూడో రోజు విచారణలో నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టారు. హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి తీసుకెళ్లి.. ప్రధాన నిందితులైన ప్రవీణ్‌ కుమార్, రాజశేఖర్‌ రెడ్డిలు యాక్సెస్‌ చేసినట్టు చెప్పిన కంప్యూటర్లు పరిశీలించారు. కంప్యూటర్ల నుంచి నిందితులు ఏ విధంగా క్వశ్చన్‌ పేపర్‌ కాపీ చేసుకున్నాడు.. ఇందుకు ఎంత సమయం పట్టిందనే విషయాలను తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version