నిరుద్యోగులకు గుడ్ న్యూస్… గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

-

తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త రాబోతోంది. త్వరలోనే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ కింద 503 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. మరోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ కూడా వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 2 కింద 582 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. ముందుగా మోటర్ వెహికిల్ ఇన్స్ పెక్టర్లు,  అటవీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయాలని యోచిస్తోంది. ఇక గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీపై నిన్న సీఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. గ్రూప్ 4 కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు ఇప్పటికే ప్రకటించారు. దీనికి అనుగుణంగా, కాలయాపన లేకుండా నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సోమేష్ కుమార్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news