దీపావళి పండుగను పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ ప్రయాణికులను దోచుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయలేదని ఫలితంగా టికెట్లు తీసుకున్నా నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చిందని ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాురు. దీపావళి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లి నగరానికి తిరిగొస్తున్న క్రమంలో అధికంగా టికెట్ చార్జీలు వసూలు చేశారని ప్యాసింజర్స్ వాపోయారు.
సాధారణ రోజుల్లో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ.330 ఉండగా.. పండగ తెల్లారి రూ.470 వసూలు చేశారన్నారు. ఇదే టైంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తే రూ.330 తీసుకున్నారని.. అలాంటప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్ రూ.470 ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. స్పెషల్ బస్సుల పేరిట ఆర్టీసీ దోపిడీకి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.