శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

-

ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. నేడు ఉదయం 9 గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ. అక్టోబర్ కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. ఈ మేరకు భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లులో ఇవ్వనున్నట్లు ఆలయ నిర్వాహణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఇటీవల తెలిపారు. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఇటీవల తెలిపారు.

TTD Online Ticket Booking: Tirupati TTD to release Special Entry Darshan  tickets from March 21; Check details | India News

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు వైవీ.సుబ్బారెడ్డి. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు ఇదివరకే వెల్లడించారు. తిరుమల కొండ భక్తజనంతో నిండి పోయింది. దీంతో టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలు వంటి ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాది సంఖ్యలో‌ భక్తులు వివిధ మార్గాల ద్వారా ఒక్కసారిగా కొండకు చేరుకోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలను టీటీటీ మరమ్మతులు చర్యలు చేపట్టడంతో ఉన్న గదులనే భక్తులకు అధికారులు కేటాయిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news