పిల్లలకు ట్యూషన్‌ చెప్పడానికి వచ్చిన టీచర్‌.. కడుపు చేసిన తండ్రి..

-

బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. కామవాంఛ కన్నుమిన్ను కానకుండా.. ఓ మృగంలా వ్యవహరించాడు.. పిల్లలకు చదువు చెప్పందుకు వచ్చిన టీచర్‌ను బ్లాక్‌ మెయిల్‌తో లొంగదీసుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.. అంతేకాకుండా.. ఆ ట్యూషన్‌ టీచర్‌ గర్భవతి కావడంతో.. గర్భం పోయేందుకు మాత్రలు ఇచ్చి.. ఆమె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీశాడో రాక్షస వైద్యుడు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని లక్నోలోని ఇందిరాన‌గ‌ర్ లో నివాసం ఉండే 50 ఏళ్ల‌ డాక్ట‌ర్ పిల్ల‌ల‌కు ట్యూష‌న్ చెప్ప‌డానికి ఓ టీచ‌ర్ అత‌డి ఇంటికి వ‌చ్చేది. ఆ స‌మ‌యంలో ఆ డాక్ట‌ర్ టీచ‌ర్ పై క‌న్నేశాడు. ఆ స‌మ‌యంలో ఆమెకు తెలియ‌కుండా కొన్ని ఫొటోలు తీసి, ఆ ఫోటోలను మార్ఫింగ్‌ చేశాడు. ఆ ఫోటోలు చూపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేయ‌డం ప్రారంభించార‌ని బాధితురాలు ఆరోపించింది.

మార్ఫింగ్ చేసి ఫొటోలు, వీడియోలు చూపించి ఆమెను బెదిరించి నెలల తరబడి అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. దీంతో బాధితురాలు గ‌ర్భం దాల్చింది. ఆ గ‌ర్భం పోయేందుకు డాక్ట‌ర్ ఆమెకు మందులు ఇచ్చాడు. దీంతో.. మందుల ప్ర‌భావం వ‌ల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె కుటుంబ స‌భ్యులు ఏం జ‌రిగింద‌ని ఆరా తీశారు. త‌న‌పై కొన్ని నెల‌లుగా జ‌రుగుతున్న దారుణ ఘ‌ట‌న‌ను ఆమె వారికి తెలిపింది. దీంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

లక్నో నార్త్ జోన్ డీసీపీ ఎస్ చినప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పిల్ల‌ల‌కు ట్యూష‌న్ చెప్పే స‌మ‌యంలో ఎక్క‌డి నుంచో నిందితుడు ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడ‌ని, త‌రువాత శారీర‌కంగా టీచ‌ర్ ను వేధించాడ‌ని చెప్పారు. బాధితురాలిని గ‌దిలో బంధించి అత్యాచారం చేశార‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో వీడియో తీసి దాని ద్వారా కూడా బ్లాక్ మెయిల్ కు పాల్ప‌డ్డార‌ని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్నామ‌ని అన్నారు. నిందితుడి వ‌య‌స్సు 50 సంవ‌త్స‌రాల‌ని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version