కోడికత్తి కేసులో ట్విస్ట్…తేలిపోతుందా?

-

కోడి కత్తి కేసు…రెండు తెలుగు రాష్టాల్లో సంచలనం సృష్టించిన కేసు..2019 ఎన్నికల ముందు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ పై…విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. కోడి కత్తితో జగన్ భుజంపై గుచ్చాడు.  విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ కు పయనమైన జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో ఈ దాడి జరిగింది.

అయితే దాడి జరిగిన వెంటనే జగన్…హైదరాబాద్ కు వెళ్ళి…అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక ఈ దాడి పూర్తిగా టీడీపీ ప్రభుత్వం చేయించిన పనే అని వైసీపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేశాయి. చంద్రబాబు,  లోకేశ్…జగన్ ని హత్య చేయించడానికి కుట్ర చేశారని ఆరోపణలు వచ్చాయి. అటు టీడీపీ ఏమో..ఈ దాడి వైసీపీనే కావాలని చేయించుకుని సానుభూతి పొందడానికి చేసిందని విమర్శించింది. అలాగే దీనిపై విచారణ చేయడానికి ఎన్‌ఐ‌ఏ కూడా దిగింది..మరి ఈ కేసు గురించి 2019 ఎన్నికల ముందు వరకు బాగానే చర్చ జరిగింది.

కానీ 2019 తర్వాత నుంచి ఈ కేసు గురించి ప్రస్తావన లేకుండా పోయింది…ఈ కేసులో ముద్దాయిగా ఉన్న శ్రీనివాస్ ఏమైపోయాడు అనే విషయం కూడా తెలియలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక…ఈ కేసు గురించి మాట్లాడిన సందర్భం లేదు..కానీ టీడీపీ మాత్రం ఎప్పటికప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుతూనే ఉంది. ఈ కేసు ఏమైందని అటు చంద్రబాబు, ఇటు పవన్ ప్రశ్నిస్తూనే వస్తున్నారు. కానీ వైసీపీ నుంచి దీని గురించి స్పందన వచ్చేది కాదు.

ఇలాంటి తరుణంలో సరిగ్గా నాలుగేళ్ల తర్వాత కోడి కత్తి కేసులో నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ ని విడుదల చేయాలని…శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌కు లేఖ రాశారు. నాలుగు సంవ‌త్స‌రాల నుంచి త‌న కుమారుడిని రిమాండ్ ఖైదీగానే ఉంచారని, త‌క్ష‌ణ‌మే శ్రీ‌నివాస్‌ను విడుద‌ల చేయాల‌ని లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ గాని,  న్యాయ‌స్థానం గాని ఎటువంటి విచార‌ణ జ‌ర‌ప‌డంలేద‌ని వెల్ల‌డించారు. మరి ఈ కేసు వ్యవహారంపై జస్టిస్ రమణ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news