రాజమౌళి సినిమా అంటే… ఆ క్రేజే వేరనుకుంటారు. కానీ.. దర్శకధీరుడి లేటెస్ట్ మూవీ ఆర్‌ఆర్ఆర్‌కు అంత సీన్ లేదా.. తెలుగులో ఏ హీరోకూ లేనంత క్రేజ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు వుందనుకుంటే.. పొరబాటు పడినట్టేనా? ఇక సీనియర్ హీరోలు.. హీరోయిన్స్ గురించి జనాలు పట్టించుకోవడమే లేదు. ఇవన్నీ నా మనసులోని మాట కాదు. ట్విట్టర్ చెప్పిన నిజాలు ఏంటంటే..
ఇంకో 15 రోజులైతే.. 2020కు గుడ్‌బై చెప్పేయాల్సిందే. ఈ ఏడాది ట్విట్టర్‌లో నెటిజన్లు ఏ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు? ఏ హీరోహీరోయిన్ల గురించి ఎక్కువ చర్చించుకున్నారన్న లెక్కలు కట్టింది ట్విట్టర్. సౌత్ ఇండియాలో టాప్‌లో నిలిచిన సినిమాలు.. హీరోహీరోయిన్ల లిస్ట్ బైటపెట్టింది ట్విట్టర్ ఇండియా. ఈ ఏడాది ఎక్కువ మాట్లాడుకున్న సినిమాలో మాస్టర్ నిలిచింది. సెకండ్ ప్లేస్‌లో వకీల్‌సాబ్ వున్నాడు.
మాస్టర్ , వకీల్‌సాబ్ సమ్మర్‌లో రావాల్సి వుండగా.. కరోనా అడ్డుకుంది. అయితే.. మాస్టర్‌కు సంబంధించి టీజర్.. సాంగ్ రిలీజ్ కాగా.. వకీల్‌సాబ్ నుంచి మోషన్ పిక్చర్ ,లిరికల్ వీడియో మాత్రమే రిలీజ్ అయ్యాయి. మాస్టర్ మాదిరి వకీల్‌సాబ్ నుంచి మరిన్ని ప్రచార చిత్రాలు వస్తే.. ఈ లాయర్ గురించే ఎక్కువ మాట్లాడుకునేవారేమో.
ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువ మాట్లాడుకున్న మూడో సినిమా వలిమై. హీరో అజిత్‌కు ఏమాత్రం ఫాలోయింగ్ తగ్గలేదు. జస్ట్ మోషన్ పిక్చర్‌తో వచ్చిన మహేశ్ ‘సర్కారువారిపాట’ నాలుగోస్థానంలో నిలిచింది. ఓటీటీలో క్లిక్ అయిన సూర్య ‘ సైరారై పోట్రు’ ఐదో స్థానం దక్కించుకుంది. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాలను ఆర్‌ఆర్‌ఆర్.. పుష్ప.. సరిలేరు నీకెవ్వరు.. కెజిఎఫ్2.. దర్బార్ నిలిచాయి. రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్స్ వున్నా.. బాహుబలి2 వంటి సన్సేషన్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ అయినా.. ఆర్‌ఆర్‌ఆర్ ఎక్కవ మాట్లాడుకోలేదు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆరో స్థానం దక్కడం అభిమానులకు అంతు చిక్కడం లేదు.
ట్విట్టర్ లెక్కలతో డార్లింగ్ ఫ్యాన్స్ బిత్తరపోయారు. ఈ ఏడాది ట్వట్టర్‌లో ఎక్కువమంది చర్చించుకున్న సినిమాల్లో.. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ కనిపించలేదు. సాహో ఫ్లాప్ అయినా.. 100 కోట్లు కలెక్ట్ చేసిన స్టామినా ప్రభాస్‌ది. ఏదేమైనా సాహో ఫ్లాప్ డార్లింగ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. ఈక్రమంలో రాధే శ్యామ్ గురించి పట్టించుకోవడం లేదా అనిపిస్తోంది.
ఇక హీరోల విషయానికొస్తే.. సౌత్‌లో ఎక్కువుగా చర్చించుకున్న పేర్లను ట్విట్టర్ బైటపెట్టింది. ఇందులో ఆరుగురు మన తెలుగు హీరోలు కావడం విశేషం. అయితే.. నెటిజన్ల ప్రిఫరెన్స్ మారింది. మోస్ట్ సెలబ్రిటీ అంటూ.. సందడి చేసిన విజయ్ దేవరకొండకు టాప్10లో స్థానం దక్కలేదు. యూత్‌లో వున్న ఫాలోయింగ్ ట్విట్టర్ లో కనిపించలేదు. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్‌తో కనిపించే విజయ్ టాప్ టెన్‌లో లేకపోవడం.. రౌడీ ఫ్యాన్స్‌కు షాకే.
ట్విట్టర్‌లో ఎక్కువ మాట్లాడుకున్న హీరోల్లో మహేశ్.. పవన్‌కల్యాణ్ పోటీపడ్డారు. మహేశ్ ఫస్ట్ ప్లేస్‌ను.. పవన్ సెకండ్ ప్లేస్‌ను ఆక్రమించారు. ఎక్కువ మాట్లాడుకున్న సినిమాగా వకీల్‌సాబ్..హీరోగా పవన్ సెకండ్ ప్లేస్ మెయిన్‌టేన్ చేశాడు. రెండేళ్లుగా సినిమాలకు దూరంగా వున్నా.. పవన్‌కు వున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదన్న మాట. 2020లో ఎక్కువ చర్చించుకున్న మూడో హీరో విజయ్. నాలుగో ప్లేస్‌తో ఎన్టీఆర్.. ఐదు..ఆరు.. ఏడు స్థానాలు సూర్య… అర్జున్.. రామ్‌చరణ్‌కు దక్కాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే ధనుష్ ఎనిమిదో ప్లేస్‌లో వున్నాడు. సీనియర్ హీరోలు మోహన్‌లాల్.. చిరంజీవి తొమ్మిది.. పది ప్లేసుల్లో వున్నారు.
సీనియర్ హీరోల్లో మెగాస్టార్ ఒక్కడే ట్విట్టర్ రేసులో వున్నాడు. ఆయన నటిస్తున్న సినిమా ఆచార్య గురించి ఎక్కువ చర్చించుకోకపోయినా.. కరోనాకు ముందు ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. రకరకాల పోస్ట్‌లతో తన గురించి మాట్లాడుకునేలా చేసి.. టాప్ టెన్‌లో స్థానం కొట్టేశాడు మెగాస్టార్. బాలకృష్ణ, వెంకటేశ్.. నాగార్జున వంటి సీనియర్స్ గురించి చర్చ ట్విట్టర్‌లో పెద్దగా జరగలేదు.
ప్రభాస్‌కు గడ్డుకాలం నడుస్తోందని ట్విట్టర్ లెక్కలు చెబుతున్నాయి. డార్లింగ్ నటిస్తున్న రాధే శ్యామ్ ట్విట్టర్‌లో ఎక్కువ చర్చించుకున్న సినిమాల జాబితాలో లేదు. ఆయన సినిమానే.. హీరోల లిస్ట్‌లో డార్లింగే లేడు. పాన్ ఇండియా హీరో అంటూ.. మనం చెప్పుకోవడమే తప్ప.. ట్విట్టర్ జనాలు ప్రభాస్‌ను పట్టించుకోలేదు. స్పాట్ (సాహో)